Mohan Babu: మీడియా పై దాడి చేసిన మోహన్ బాబు!

మంచు మనోజ్ కి (Manchu Manoj) మోహన్ బాబు (Mohan Babu) , విష్ణు(Manchu Vishnu) ..ల మధ్య గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో ఏదైనా ఘోరాలు జరిగే అవకాశం ఉందని భావించి వారి లైసెన్స్డ్ రివాల్వర్స్ ని సీజ్ చేసినట్లు తెలుస్తుంది. మరోపక్క జల్ పల్లిలో ఉన్న మోహన్ నివాసం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులని కలిసి ఇంటికి వెళ్తుంటే.. మనోజ్ ను మోహన్ బాబు సిబ్బంది లోపలికి అనుమతించలేదు. తన 7 నెలల పాప ఇంట్లో ఉందని, తనని దయచేసి ఇంట్లోకి అనుమతించాలని మనోజ్ కోరినా అక్కడి వారు వినలేదు.

Mohan Babu

దీంతో మనోజ్ గేట్ ను బలవంతంగా తోసుకుంటూ లోపలి వెళ్ళాడు. దీన్ని కవర్ చేయడానికి వెళ్లిన మీడియా వారిపై మోహన్ దాడి చేయడం గమనార్హం. మీడియా ప్రతినిధుల చేతిలో ఉన్న మైకులని తీసుకుని.. మోహన్ బాబు కొట్టడానికి వచ్చారు. తర్వాత ఆ మైకులని నేలకేసి కొట్టారు.వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఆయన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మరోపక్క మోహన్ బాబు ఓ ఆడియో విడుదల చేశారు.

అందులో అందరికంటే ఎక్కువగా మనోజ్ ను గారాభంగా పెంచినట్టు చెప్పారు. ‘అంతేకాదు ఎక్కువ ఖర్చుపెట్టి చదివించాను, నువ్వు ఏదడిగినా ఇచ్చాను. నువ్వు మంచి నటుడివి. కానీ ఇప్పుడు భార్య మాటలు విని మమ్మల్ని గుండెలపై తన్నావ్. తాగుడుకు అలవాటు పడి.. భార్య మాట విని నువ్వు చేస్తున్న పనులేంటి? గొడవలు లేని కుటుంబాలు ప్రపంచంలో ఉండవు. కానీ నువ్వు ఇంట్లో పనివాళ్లని ఎందుకు కొడుతున్నావ్.? ఇప్పటికైనా మారి బయట ఉండు అంటే మళ్ళీ ఇంట్లో ఉంటాను అన్నావ్. రోజూ తాగుతున్నావ్. ఎందుకు ఇలా మారిపోయావు?’ అంటూ ఎమోషనల్ గా మాట్లాడారు.

మంచు ఫ్యామిలీ గొడవ.. మీడియా ముందుకు వచ్చిన మనోజ్..వీడియో వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus