మోహన్ బాబుకి రామోజీ లేఖ !!

రామోజీ గ్రూప్ చైర్మన్, పద్మ విభూషణ్ రామోజీ రావు డైలాగ్ కింగ్ మోహన్ బాబుని అభినందిస్తూ లేఖ రాశారు. ఈ విషయాన్నిమోహన్ బాబు తన ట్విట్టర్ అకౌంట్ లో శుక్రవారం తెలిపారు. రామోజీ పంపించిన లేఖను కూడా పోస్ట్ చేశారు.

ఆ లేఖలో.. “తెలుగు చలన చిత్ర పరిశ్రమకే గర్వకారణమైన రీతిలో మీరు బ్రిటన్ కు చెందిన ఆసియన్ లైట్ సంస్థ నుంచి ప్రణం పురస్కారం పొందిన శుభ సందర్భంగా మీకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. డైలాగ్ కింగ్ గా తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందిన కథానాయకులు మీరు. వివిధ సినిమాలో మీరు చెప్పిన డైలాగులు “బెస్ట్ డైలాగ్స్” గా పుస్తక రూపం దాల్చడం నాకెంతో సంతోషం కలిగించింది. ఆ పుస్తకం బ్రిటన్ పార్లమెంట్ లో ఆవిష్కరణకు నోచుకోవడం మరెంతో ఆనందాన్నిచ్చింది. నిజ జీవితంలో హీరో అనదగ్గ విశిష్ట వ్యక్తిత్వం కలిగిన మీరు మరెన్నో గౌరవాలు పొందాలని మనసారా కాంక్షిస్తూ … మీ రామోజీ రావు ” అని ఉంది. తను ఈ లేఖను అందుకోవడం ఒక గౌరవంగా భావిస్తున్నట్లు మోహన్ బాబు ట్వీటారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus