Mohan Babu: భారీ బడ్జెట్ సినిమాతో మోహన్ బాబు రిస్క్ చేస్తున్నారా.. ఏమైందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి మోహన్ బాబు ఊహించని స్థాయిలో సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం మోహన్ బాబు పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు. ఈ మధ్య కాలంలో మోహన్ బాబు నటించిన సినిమాలేవీ ఆశించిన ఫలితాలను సొంతం చేసుకోలేదు. మరోవైపు మోసగాళ్లు, జిన్నా ఫ్లాపుల తర్వాత విష్ణు సైతం సైలెంట్ అయ్యారు. అయితే తాను, విష్ణు కలిసి 100 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఒక సినిమాను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నట్టు సంచలన ప్రకటన చేశారు.

త్వరలో మంచు విష్ణు ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తారని (Mohan Babu) మోహన్ బాబు చెప్పుకొచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయని ఆయన కామెంట్లు చేశారు. అయితే భారీ బడ్జెట్ సినిమాలతో మోహన్ బాబు రిస్క్ చేసున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి త్వరలో పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది.

భక్త కన్నప్ప కథతో ఈ సినిమా తెరకెక్కే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుండగా ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. రాబోయే రోజుల్లో అయినా మంచు ఫ్యామిలీకి భారీ విజయాలు దక్కుతాయేమో చూడాల్సి ఉంది. సోషల్ మీడియాలో నెగిటివిటీని మంచు ఫ్యామిలీ తగ్గించుకోవాలని కొంతమంది చెబుతున్నారు. మరోవైపు మంచు మనోజ్ ప్రస్తుతం వాట్ ద ఫిష్ అనే సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమా ఈ ఏడాదే థియేటర్లలో రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని షాకింగ్ అప్ డేట్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో విష్ణు, మనోజ్ మధ్య గొడవ హాట్ టాపిక్ అయిందనే సంగతి తెలిసిందే. రాబోయే రోజుల్లో మంచు ఫ్యామిలీకి విజయాలు దక్కుతాయేమో చూడాలి.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus