లెజెండరీ సింగర్ బాలసుబ్రమణ్యం ఆసుపత్రిలో కరోనాతో పోరాడుతున్నారు. ఆయన కోవిడ్ కారణంగా ఆసుపత్రిలో చేరి మూడు వారాలు అవుతుంది. దీనితో ఆయన త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా తిరిగి రావాలని అందరూ కోరుకుంటున్నారు. ఇక పరిశ్రమలోని ప్రముఖులు బాలుతో తమకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. సీనియర్ నటుడు మోహన్ బాబు కూడా ఎస్పీ బాలుతో తనకు గల సాన్నిహిత్యాన్ని తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టారు. మోహన్ బాబు మరియు బాలు చిన్నప్పటి నుండి మిత్రులు అట.
మోహన్ బాబు ఆయనను బాలు అనిపిలిచేవారట. ఇక బాలు మోహన్ బాబును వెరైటీగా శిశుపాల, భక్త అని పిలిచేవాడట. ఇక మోహన్ బాబు నటుడిగా అవకాశాల కోసం తిరుగుతున్నప్పటికే బాలు సింగర్ గా సెటిల్ అయ్యారు. చెన్నైలో మోహన్ బాబు ఒక సంధర్భంలో భోజనానికి కూడా డబ్బులు లేక ఇబ్బంది పడ్డారట. ఆ సమయంలో మోహన్ బాబు సింగర్ బాలు దగ్గర వందల రూపాయలు అప్పు తీసుకున్నారట.
ఐతే మోహన్ బాబు ఆయన దగ్గర తీసుకున్న వందల రూపాయలు ఇంకా ఇవ్వలేదట. ఇప్పటికి కూడా నా వంద రూపాయలు ఇవ్వలేదుగా, ఇప్పటికి అది ఒక కోటి అయ్యుంటుందని బాలు మోహన్ బాబును ఆట పట్టిస్తారట. ఈ అరుదైన సంధర్భాన్ని మోహన్ బాబు గుర్తు చేసుకున్నారు.