మోహన్ బాబు నెక్స్ట్ టార్గెట్ ఫిక్స్?

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. విలన్ గా తన కెరీర్ ను మొదలు పెట్టి ఎన్నో చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించారు మోహన్ బాబు. తరువాత హీరోగా కూడా మారి ఎన్నో హిట్లను అందుకున్నారు . ‘లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్’ బ్యానర్ ను స్థాపించి ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మించారు.ఆయన విలన్ గా నటించే రోజుల్లో హీరోలతో సమానంగా పారితోషికం అందుకునే వారంటే మోహన్ బాబు క్రేజ్ మరియు డిమాండ్ ఏంటన్నది మనం అర్ధం చేసుకోవచ్చు.

ఇక మోహన్ బాబు కొడుకులు విష్ణు, మనోజ్ లు హీరోలుగా మారిన తరువాత సినిమాలను తగ్గించారు. ఇక ఈ మధ్య కాలంలో మోహన్ బాబు తన కాలికి సర్జరీ చేయించుకోవడం వల్ల సినిమాలకు మరింతగా దూరంగా ఉంటూ వస్తున్నారు. సూర్య హీరోగా నటిస్తున్న ‘ఆకాశమే నీ హద్దురా’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు మోహన్ బాబు. అంతేకాకుండా ‘స‌న్ ఆఫ్ ఇండియా’ అనే చిత్రంలో లీడ్ రోల్ పోషించడానికి రెడీ అయ్యారు.

అటు తరువాత డైరెక్టర్ గా కూడా మారి సినిమాలను తెరకెక్కించాలి అనుకుంటున్నారట. చిన్న, మీడియం రేంజ్ హీరోలతో సినిమాలను డైరెక్ట్ చెయ్యడానికి స్క్రిప్ట్ లు రెడీ చేసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత వరకూ నిజముందో తెలియాల్సి ఉంది.

Most Recommended Video

మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
మన తెలుగు సినిమాలు ఏవేవి బాలీవుడ్లో రీమేక్ అవ్వబోతున్నాయంటే?
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus