ఎన్టీఆర్ కు మోహన్ లాల్ గిఫ్ట్ ఇచ్చారు!

  • April 16, 2016 / 07:13 AM IST

ఎన్టీఆర్, మోహన్ లాల్ లు కలిసి కొరటాల శివ దర్శకత్వంలో ‘జనతా గ్యారేజ్’ సినిమాలో నటిస్తున్నాడు. ఏప్రిల్ 14న మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఎన్టీఆర్ కు ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారట. నిజానికి ఏప్రిల్ 14న మలయాళీయుల నూతన సంవత్సరాది కావడంతో మోహన్ లాల్ ఎన్టీఆర్ కు స్పెషల్ గా చేయించిన స్వీట్స్ తో పాటు, వెండి కృష్ణుడి విగ్రహాన్ని కానుకగా ఇచ్చారట. జనతా గ్యారేజ్ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన బంధంమే దీనికి కారణమని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా మూడవ షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ లోని సారధి స్టూడియోస్ లో జరుగుతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus