నందమూరి అభిమానులు ఎప్పటినుంచో వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న తరుణానికి తొందర్లోనే ఫుల్ స్టాప్ పడనుందా.. అంటే అవును అనే అంటున్నాయి సినీ వర్గాలు. వారిలో ఉత్సాహాన్ని నింపే వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. టాలీవుడ్‌లో వారసుల ఎంట్రీలు గురించి టాపిక్ వచ్చినప్పుడల్లా మొదటగా వినపడేది నటసింహం బాలయ్య వారసుడు మోక్షజ్ఞ గురించే, ఈ నేపథ్యంలో నందమూరి కుటుంబానికి చెందిన మోక్షజ్ఞ తేజ ఎంట్రీపై మళ్లీ చర్చ మొదలైంది. చాలా కాలంగా ఆయన సినిమా రంగ ప్రవేశం గురించి వార్తలు వినిపిస్తున్నప్పటికీ, ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. అయితే తాజాగా కొన్ని ఆసక్తికరమైన అప్‌డేట్లు వినిపిస్తున్నాయి.
మొదటగా, ‘హనుమాన్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ, మోక్షజ్ఞను లాంచ్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ ప్రాజెక్ట్ కొన్ని కారణాల వల్ల ముందుకు సాగలేదని తెలుస్తోంది. ఆ తరువాత దర్శకుడు తేజ, అలాగే బోయపాటి శ్రీను పేర్లు కూడా వినిపించాయి. ఇప్పుడు మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది.
యువ హీరో నానితో “సరిపోదా శనివారం” సినిమాతో హిట్ అందుకున్న దర్శకుడు వివేక్ ఆత్రేయతో మోక్షజ్ఞ సినిమా చేయబోతున్నాడనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ కాంబినేషన్ నిజమైతే, మోక్షజ్ఞకు ఒక మంచి స్టార్ట్ దక్కే అవకాశం ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.
ఇక నందమూరి బాలకృష్ణ విషయానికి వస్తే, ఆయన తనదైన శైలిలో వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఇటీవల వచ్చిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, ఆయన క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం రెండు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న బాలయ్య, త్వరలోనే అభిమానులను మరోసారి ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. మొత్తానికి, మోక్షజ్ఞ ఎంట్రీపై స్పష్టత రావాల్సి ఉన్నా, ఈ వార్తలు మాత్రం నందమూరి అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. త్వరలోనే ఈ సస్పెన్స్‌కు తెరపడే అవకాశం ఉన్నట్లు సమాచారం.