బిగ్ బాస్ 4: మోనాల్ మదర్ రాలేదా..?

  • November 19, 2020 / 02:29 PM IST

బిగ్ బాస్ హౌస్ హౌస్ మేట్స్ ని పలకరించేందుకు ఫ్యామిలీ మెంబర్స్ రావడం అనేది జరుగుతూనే ఉంటుంది. అన్ని సీజన్స్ లో కూడా 70రోజుల జెర్నీ తర్వాత హౌస్ మేట్స్ ని వాళ్ల కుటుంబసభ్యులు వచ్చి పలకరిస్తూనే ఉంటారు. సీజన్ 4 లో కూడా కమాండెంట్ టాస్క్ లో భాగంగా అభిజిత్ వాళ్ల మదర్, అఖిల్ , హారిక, అవినాష్ వాళ్ల మదర్స్ వచ్చి వారిని ఆప్యాయంగా పలకరించారు. అయితే, రీసంట్ గా వచ్చిన బిగ్ బాస్ ప్రోమోలో మాత్రం మోనాల్ వాళ్ల మదర్ కేవలం వాయిస్ మెసేజ్ మాత్రమే పంపింది. కొన్ని కారణాల వల్ల రాలేకపోతున్నాం అని చెప్పింది.

దీంతో బాగా ఎమోషనల్ అయిన మోనాల్ బాత్రూమ్ లోకి వెళ్లి మరీ బోరున విలపించింది. అమ్మని గుర్తుచేసుకుంటూ బాధపడింది. దీంతో మిగతా హౌస్ మేట్స్ అందరూ కూడా ఎంతో ఆవేదనకి గురి అయ్యారు. మోనాల్ ని ఓదార్చలేకపోతున్నారు.

అంతకుముందు ప్రోమోలో చూసినట్లయితే, లాస్య కొడుకు జున్ను, లాస్య భర్త , అలాగే అరియానా ఫ్యామిలీ మెంబర్ వినయ్, సోహైల్ ఫాదర్ వచ్చారు. కానీ మోనాల్ కి మాత్రం ఆడియో మెసేజ్ వచ్చినట్లుగా మాత్రమే చూపించారు. మరి తర్వాత వీడియో సందేశం ఏదైనా ప్లే చేశారా..? లేదా కేవలం ఆడియో మెసేజ్ విని మోనాల్ ఆవేదన చెందిందా తెలియాలంటే ఎపిసోడ్ చూడాల్సిందే. అదీ మేటర్.


ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?
ఈ 12 మంది ఆర్టిస్ట్ ల కెరీర్.. షార్ట్ ఫిలిమ్స్ ద్వారానే మొదలయ్యింది..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus