Month of Madhu First Review: కలర్స్ స్వాతి రీ ఎంట్రీ మూవీ ‘మంత్ ఆఫ్ మధు’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది… ఎలా ఉందంటే?

Advertisement

నవీన్ చంద్ర హీరోగా స్వాతి రెడ్డి హీరోయిన్ గా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘మంత్ ఆఫ్ మధు’. ‘భానుమతి & రామకృష్ణ’ వంటి ఓటీటీ హిట్ అందుకున్న దర్శకుడు శ్రీకాంత్ నాగోతి, నిర్మాత యశ్వంత్ ములుకుట్ల కాంబినేషన్లో ‘క్రిషివ్ ప్రొడక్షన్స్’, ‘హ్యాండ్‌పిక్డ్ స్టోరీస్’ బ్యానర్‌పై రూపొందిన చిత్రమిది. ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన పాటలు, టీజర్, ట్రైలర్.. వంటివి ప్రేక్షకులకి కొత్త అనుభూతిని కలిగించాయి.అక్టోబర్ 6న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.

ఈ క్రమంలో ఇండస్ట్రీకి చెందిన కొంతమంది ప్రముఖులకు.. ఈ చిత్రం ప్రీమియర్ షో వేయడం జరిగింది. కథ విషయానికి వస్తే.. మధుసూదనరావు(నవీన్ చంద్ర) లేఖ(స్వాతి రెడ్డి అలియాస్ కలర్స్ స్వాతి) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల విడిపోతారు. లేఖ మాత్రం తన భర్త మధుకి కచ్చితంగా విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయ్యి కోర్టుని ఆశ్రయిస్తుంది. మరోపక్క మధుసూదనరావు మాత్రం తనకు విడాకులు తీసుకోవడం ఇష్టం లేదని వేరే లాయర్ తో విచారణకి వెళ్తూ ఉంటాడు.

మధ్యలో మధు అనే ఎన్నారై అమ్మాయి ఇండియా వస్తుంది. అతనికి మధుసూధనరావుకి పరిచయమవుతుంది. ఈ క్రమంలో మధుసూధనరావు, లేఖ ల జీవితాల్లో చోటు చేసుకున్న పరిస్థితులు ఏంటి.. చివరికి వాళ్ళు కలిసున్నారా? విడిపోయారా? అనేది మిగిలిన కథ అని తెలుస్తుంది. ఫస్ట్ హాఫ్ కొంతవరకు పర్వాలేదు అనిపించినా.. సెకండ్ హాఫ్ మాత్రం చాలా ల్యాగ్ ఉంది అంటూ సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు.

క్లైమాక్స్ లో కూడా కన్క్లూజన్ సరిగ్గా ఇవ్వలేదని, థియేటర్స్ లో (Month of Madhu) ఈ సినిమాని భరించడం చాలా కష్టమని అంటున్నారు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ విషయంలో మాత్రం పాస్ మార్కులు పడతాయట. టార్గెటెడ్ ఆడియన్స్ కూడా ఈ ‘మంత్ ఆఫ్ మధు’ ని అలరించే అవకాశాలు చాలా తక్కువ అని అంటున్నారు. ఓపిక ఉంటే.. ఓటీటీల్లో ట్రై చేసుకోవచ్చని వారు చెప్పుకొచ్చారు. మరి అక్టోబర్ 6 న ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus