Month Of Madhu: మంత్ ఆఫ్ మధు సర్ ప్రైజ్ చూడాలంటే ఫార్మ్ నింపాల్సిందే..!

  • October 5, 2023 / 08:14 PM IST

హోస్ట్‌గా సినీ సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తూ.. తన కెరీర్‌ను ప్రారంభించింది కలర్స్ స్వాతి. ఆ ప్రోగ్రామ్ పేరు కలర్స్ కావడంతో ఇప్పటికీ చాలామందికి తను కలర్స్ స్వాతిగానే గుర్తుండిపోయింది. వెండితెరపై హీరోయిన్‌గా ఎంటర్ అయిన తర్వాత వెంటవెంటనే సినిమాలు చేయాలని స్వాతి ఏమీ తొందరపడలేదు. అందుకే ఎప్పటికప్పుడు బ్రేక్స్ తీసుకుంటూ ఉంటుంది. చాలాకాలం తర్వాత స్వాతి ‘మంత్ ఆఫ్ మధు’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ కోసం ప్రేక్షకులకు ఒక స్పెషల్ సర్‌ప్రైజ్ ప్లాన్ చేసింది టీమ్.

‘మంత్ ఆఫ్ మధు’ (Month Of Madhu) సినిమా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 6న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ప్రపంచమంతా ఆ సినిమాను చూసే ముందే సీక్రెట్ స్క్రీనింగ్స్ పేరుతో కొంతమందికి ప్రత్యేకంగా స్క్రీనింగ్స్‌ను ఏర్పాటు చేస్తోంది మూవీ టీమ్. అక్టోబర్ 5 సాయంత్రం కేవలం హైదరాబాద్, వైజాగ్‌లో మాత్రమే ఈ స్క్రీనింగ్స్ జరగనున్నాయి. ‘మీరు ప్రేమించిన వారితో కలిసి ఈ నిజమయిన ప్రేమకథను ఆస్వాదించండి’ అంటూ మూవీ టీమ్.. ఈ స్పెషల్ స్క్రీనింగ్స్ గురించి బయటపెట్టింది.

కాకపోతే ‘మంత్ ఆఫ్ మధు’ స్పెషల్ స్క్రీనింగ్స్‌లో పాల్గొనాలంటే ఒక ఫార్మ్‌ను నింపాల్సి ఉంటుంది. ఈ ఫార్మ్ లింక్‌ను స్వాతి సైతం తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇటీవలే సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తో కలిసి సోల్ ఆఫ్ సత్య పేరుతో ఓ ఆల్బమ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మంత్ ఆఫ్ మధు సినిమాతో వెండితెరపై సందడి చేయబోతుంది. ఇందులో నవీన్ చంద్ర ప్రధాన పాత్ర పోషించారు. వీరిద్దరు కలిసి గతంలో త్రిపుర చిత్రంలో నటించారు. ఇప్పుడు మరోసారి కలిసి అలరించనున్నారు.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus