ఈ ఏడాది గూగుల్ సెర్చ్ లో ఆర్ఆర్ఆర్ ఏ స్థానంలో ఉందో తెలుసా?

  • December 7, 2022 / 07:55 PM IST

ప్రతి ఏడాది ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తూ భారీ స్థాయిలో కలెక్షన్లను రాబడుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది పాన్ ఇండియా స్థాయిలో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నాయి. మరి కొన్ని రోజులలో 2022వ సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో సినిమాల గురించి పలు సర్వేలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే గూగుల్ సెర్చ్ ఇంజన్ ఇయర్ ఇన్ సెర్చ్ 2022నుఆవిష్కరించింది.

ఈ 11 నెలలలో గూగుల్లో ఎక్కువగా ఏ సినిమా కోసం సర్చ్ చేసారు అనే విషయాన్ని వెల్లడించింది. ఈ క్రమంలోనే ఎక్కువగా రణబీర్ కపూర్ ఆలియా భట్ నటించిన బ్రహ్మాస్త్ర పార్ట్ 1 సినిమాని సెర్చ్ చేసినట్లు వెల్లడించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఈ ఏడాది ఎక్కువగా సెర్చ్ చేసిన సినిమాల జాబితాలో మొదటి స్థానంలో ఉంది. కరోనా ముందు నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయినప్పటికీ

ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 400 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా తర్వాత తదుపరి రెండో స్థానంలో కే జి ఎఫ్ 2, మూడవ స్థానంలో ది కాశ్మీర్ ఫైల్స్, నాలుగవ స్థానంలో ఆర్ఆర్ఆర్ సినిమాలు నిలిచాయి.

ఈ సినిమా తర్వాత వరుసగా తదుపరి స్థానాలలో కాంతారా, పుష్పాది రైజ్, విక్రమ్, లాల్ సింగ్ చద్దా, దృశ్యం 2, థర్ లవ్ అండ్ థండర్ సినిమాలను ఎక్కువగా గూగుల్ సెర్చ్ చేశారు.ఇకపోతే పుష్ప సినిమా గత ఏడాది విడుదలైనప్పటికీ ఈ సినిమా ఈ ఏడాదిలో పెద్ద ఎత్తున ఆధిపత్యం చెలాయించింది. ఇలా పదిలో ఆరు దక్షిణాది సినిమాలు ఉండటం విశేషం.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus