2017 .. తెలుగు చిత్ర పరిశ్రమకు కలిసి వచ్చిన సంవత్సరంగా మిగిలిపోతే.. ఈ సంవత్సరంలో ఎక్కువ సినిమాలు రిలీజ్ అయిన నెలగా సెప్టెంబర్ నిలిచింది. సెప్టెంబర్ 1 న బాలకృష్ణ పైసా వసూల్ , కన్నడ సినిమాని తెలుగులో ‘రథావరం’ అనే పేరుతో విడుదలయ్యాయి. సెప్టెంబర్ 2న ‘వెళ్ళిపోమాకే’, ‘షాలిని’ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. సెప్టెంబర్ రెండవ వారం (8వ తేదీ)న యుద్ధం శరణం’, ‘మేడ మీద అబ్బాయి వచ్చి మిశ్రమ స్పందనతో నడుస్తున్నాయి. ఇక శుక్రవారం వరకు అంటే 15 వ తేదీ వరకు సినిమాలు ఏవీ విడుదలకావు. కానీ 15 నుంచి 30 వరకు (15 రోజుల్లో) 9 సినిమాలు సందడి చేయనున్నాయి.
15వ తేదీన ఒక్కరోజే 6 సినిమాలు థియేటర్లలోకి వస్తుండడం విశేషం. వాటిలో నారా రోహిత్ ‘కథలో రాజకుమారి’, సందీప్ కిషన్ ‘ప్రాజెక్ట్ జెడ్’, సునీల్ ‘ఉంగరాల రాంబాబు’, సచిన్ జోషి ‘వీడెవడు’, విజయేంద్ర ప్రసాద్ డైరెక్ట్ చేసిన ‘శ్రీవల్లి’ చెప్పుకోదగిన సినిమాలు కాగా శింబు, నయనతారల డబ్బింగ్ చిత్రం ‘సరసుడు’ కూడా అదే రోజు రిలీజ్ కానుంది. దసరా సందర్భంగా ‘జై లవ కుశ’ సెప్టెంబర్ 21న వస్తుండగా, ‘స్పైడర్’ 27న థియేటర్లోకి రానుంది. ‘స్పైడర్’ విడుదలైన రెండు రోజులకే అనగా సెప్టెంబర్ 29న శర్వానంద్ నటించిన ‘మహానుభావుడు’ కూడా విడుదలకానుంది. మొత్తం మీద ఈ నెల చివరి 15 రోజులు థియేటర్లన్నీ సినిమాలతో కళకళలాడిపోనున్నాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.