ఈ శుక్రవారం సినిమాలన్నీ విభిన్నమైనవే

ప్రతివారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదలవుతుంటాయి. వాటిలో తెలుగు చిత్రాల సంఖ్య ఎప్పుడూ ఎక్కువే. కానీ.. కొన్నిసార్లు విడుదలయ్యే సినిమాలు ఒకే రకంగా ఉంటాయి. కానీ ఈ శుక్రవారం మాత్రం వైవిధ్యమైన సినిమాలు వస్తున్నాయి మన తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీ నుంచి. సుధీర్ బాబు నటించి-నిర్మించిన “నన్ను దోచుకుందువటే”, విక్రమ్-కీర్తి సురేష్ జంటగా నటించిన “సామి”, విజయ్ మాస్టర్ కొడుకు రాహుల్ విజయ్ కథానాయకుడిగా పరిచయమవుతూ నటించిన “ఈ మాయ పేరేమిటో” వంటి స్ట్రయిట్ సినిమాలతోపాటు యాక్షన్ కింగ్ నటించిన 150వ సినిమా “కురుక్షేత్రం” కూడా రేపు విడుదలవుతోంది.

ఈ నాలుగు సినిమాలతోపాటు బాలీవుడ్ నుంచి షాహిద్ కపూర్-శ్రద్ధకపూర్ జంటగా నటించిన “బట్టి గల్ మీటర్ చాలు”, హాలీవుడ్ నుంచి “ది ఈక్వలైజర్” అనే యాక్షన్ థ్రిల్లర్ విడుదలవుతోంది. ఈ రెండు సినిమాల మీద కూడా మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఈ శుక్రవారం విజేతలు ఎవరో రేపటికల్లా ఎలాగూ తెలిసిపోతుంది కాబట్టి.. ఏ సినిమా ప్రేక్షకుల మనసు గెలుచుకుంటుంది? ఏ సినిమా విశ్లేషకుల విమర్శలు సొంతం చేసుకుంటుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus