సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టాలంటే ఎంతో కష్టమో అందరికి తెలుసు. అందులో అమ్మాయిలకు ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినీ పరిశ్రమలో కొత్తగా అడుగుపెట్టిన వాళ్లకు ఎన్నో చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. మరీ ముఖ్యంగా.. అమ్మాయిలైతే చాలా కష్టాలు ఎదుర్కోవల్సి వస్తుంది. క్యాస్టింగ్ కౌచ్ అని కొందరు వేధిస్తే.. మరికొందరు సినిమాలో ఎంపిక చేసినట్టే చేసి ఆ తర్వాత తొలగిస్తుంటారు. వారి స్థానంలో మరొకరిని తీసుకుంటారు. తనని కూడా అలాగే రెండు సినిమాల నుంచి నిర్దాక్షిణ్యంగా తొలగించారంటూ.. భూమికా చావ్లా చెప్పుకొచ్చింది..
కిసీ కా భాయ్, కిసీ కా జాన్ సినిమాలో నటించిన ఈ అమ్మడు.. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో (Bhumika) తనకు ఎదురైన బ్యాడ్ ఎక్స్పీరియెన్సెస్ గురించి చెప్పుకొచ్చింది. “నేను హిందీలో చేసిన తొలి సినిమా తేరే నామ్ మంచి విజయం సాధించడంతో.. నాకు మంచి మంచి అవకాశాలు రావడం మొదలయ్యాయి. తేరే నామ్ తర్వాత నాకు ఒక పెద్ద ఆఫర్ వచ్చింది. కానీ.. నిర్మాతలు మారిపోవడంతో హీరోతో పాటు నన్ను ఆ ప్రాజెక్ట్ నుంచి తొలగించారు. టైటిల్ కూడా ఛేంజ్ చేశారు.
ఒకవేళ ఆ సినిమా చేసి ఉంటే, ఇప్పుడు పరిస్థితి మరోలా ఉండేదేమో! ఆ సినిమా ఆఫర్ వచ్చినప్పుడు నేను ఏదేదో ఊహించుకున్నాను. కానీ.. ఇంకేది జరిగింది. ఆ సినిమా కోసం నేను మరే మూవీ ఒప్పుకోకుండా, ఏడాది పాటు ఎదురుచూశాను. చివరికి నాకు నిరాశే మిగిలింది. కేవలం ఇదొక్కటే కాదు.. జబ్ వీ మెట్ సినిమాకి మొదటగా నేనే సంతకం చేశాను. తొలుత నాకు జోడీగా బాబీ డియోల్ అన్నారు. ఆ తర్వాత షాహిద్ కపూరిని తీసుకున్నారు.
కట్ చేస్తే.. ఆ సినిమాలో షాహిద్ కపూర్, కరీనా కపూర్ కలిసి నటించారు. నన్ను తీసేశారు” అంటూ భూమికా చెప్పుకొచ్చింది. మున్నా భాయ్ ఎంబీబీఎస్ సినిమాకు కూడా తాను సంతకం చేశానని.. ఏమైందో ఏమో తెలీదు కానీ ఆ ప్రాజెక్ట్ నుంచి కూడా తనని తొలగించారని భూమికా పేర్కొంది. మణిరత్నం రూపొందించిన ‘కన్నతిల్ ముత్తమిట్టల్’ సినిమాలోనూ నేనే హీరోయిన్ అని చెప్పి.. చివరికి తనకు హ్యాండ్ ఇచ్చారని ఆమె తెలిపింది. ప్రస్తుతం టాలీవుడ్ లో భూమిక ప్రత్యేక పాత్రలో నటిస్తోంది.