ఈ 10 సినిమాలు ఇండస్ట్రీ హిట్లు కాదు.. కానీ ఇండస్ట్రీ హిట్లుగా ప్రొజెక్ట్ అయ్యాయి..!

  • November 14, 2022 / 08:00 AM IST

ఇండస్ట్రీ హిట్.. ఈ పదానికి చాలా విలువ, చాలా గౌరవం ఉంటాయి. సాధారణంగా ఇండస్ట్రీ హిట్ అంటే సినిమాల్లో అప్పటివరకు వచ్చిన సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్లు రాబడితే అవి ఇండస్ట్రీ హిట్లుగా పిలవబడతాయి. ఇండస్ట్రీ హిట్ అయినంత మాత్రాన అది గొప్ప సినిమా అని అనడానికి లేదు. ఆ సినిమా రిలీజ్ అయిన టైంకి ఉన్న అడ్వాంటేజ్ ల బట్టి.. అది ఇండస్ట్రీ హిట్ గా నిలిచి ఉండొచ్చు. అయితే స్టార్ హీరోల అభిమానులు.. ఒక్కోసారి స్టార్ హీరోలు ఇండస్ట్రీ హిట్ ను చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంటారు. తమ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టింది అనేలా ప్రచారం చేయించుకుంటారు. హీరోలు కాకపోతే దర్శకులు, నిర్మాతలు ఇండస్ట్రీ తమ సినిమా ఇండస్ట్రీ హిట్ అని ప్రచారం చేయించుకుంటారు. తద్వారా ఆ సినిమాకు భారీ కలెక్షన్లు వస్తాయి అనేది వారి ఆలోచన కావచ్చు. అందుకే కొన్ని సినిమాలు ఇండస్ట్రీ హిట్లు కాకపోయినా.. ఇండస్ట్రీ హిట్లుగా ప్రొజెక్ట్ అయ్యాయి. కొన్ని సార్లు ఆ ప్రచారం ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టింది అని కూడా చెప్పుకోవచ్చు. మరి టాలీవుడ్లో కాంట్రవర్షియల్ ఇండస్ట్రీ హిట్లుగా నిలిచిన ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) పసివాడి ప్రాణం :

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ గా ప్రొజెక్ట్ అయ్యింది.కానీ ఇది ఇండస్ట్రీ హిట్ కాదు. ఎ.కోదండ రామిరెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు.

2) అత్తకు యముడు అమ్మాయికి మొగుడు :

చిరంజీవి నటించిన ఈ మూవీ కూడా ఇండస్ట్రీ హిట్ గా ప్రొజెక్ట్ అయ్యింది.కానీ కాదు. దీనికి కూడా ఎ.కోదండరామిరెడ్డి దర్శకుడు.

3) యముడికి మొగుడు :

రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రూపొందిన ఈ మూవీ కూడా ఇండస్ట్రీ హిట్ అని అంతా అనుకుంటారు. కానీ కాదు.

4) ఖుషి :

పవన్ కళ్యాణ్ హీరోగా ఎస్.జె.సూర్య దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కూడా ఇండస్ట్రీ హిట్ అని ప్రచారం జరిగింది. ఇది కూడా ఇండస్ట్రీ హిట్ కాదు. పవన్ కెరీర్లో ‘అత్తారింటికి దారేది’ మాత్రమే ఇండస్ట్రీ హిట్ మూవీ.

5) సింహాద్రి :

ఎన్టీఆర్- రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ కూడా ఇండస్ట్రీ హిట్ అనుకుంటారు. కానీ ఎన్టీఆర్ కెరీర్లో మాత్రమే ఇది బిగ్గెస్ట్ సక్సెస్ సాధించిన మూవీ. ఇండస్ట్రీ హిట్ కాదు. నిజానికి ఎన్టీఆర్ కెరీర్లో ‘ఆర్.ఆర్.ఆర్’ తప్ప మరో ఇండస్ట్రీ హిట్ మూవీ లేదు.

6) ఠాగూర్ :

చిరంజీవి – వినాయక్ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీని కూడా అంతా ఇండస్ట్రీ హిట్ అనుకుంటారు. కానీ కాదు. ఆ టైంకి చిరు ‘ఇంద్ర’ తో ఇండస్ట్రీ హిట్ కొట్టారు.

7) దూకుడు :

మహేష్ బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కూడా ఇండస్ట్రీ హిట్ అని ప్రచారం జరిగింది. కానీ కాదు. మహేష్ కెరీర్లో ‘పోకిరి’ మాత్రమే ఇండస్ట్రీ హిట్.

8) గబ్బర్ సింగ్ :

పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కూడా ఇండస్ట్రీ హిట్ అని ప్రచారం జరిగింది. కానీ ఇది కూడా ఇండస్ట్రీ హిట్ కాదు.

9) అల వైకుంఠపురములో :

అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ కూడా నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్. కానీ ఇండస్ట్రీ హిట్ గా ప్రచారం చేశారు.

10) సరిలేరు నీకెవ్వరు :

మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ కూడా ఇండస్ట్రీ హిట్ అంటూ ప్రచారం చేసుకున్నారు కానీ కాదు.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus