‘కలర్ ఫోటో’ వంటి నేషనల్ అవార్డు ఫిలింని అందించిన సందీప్ రాజ్ దర్శకత్వంలో రూపొందిన రెండో సినిమా ‘మోగ్లీ’. అతను డైరెక్ట్ చేసింది రెండో సినిమా అయినప్పటికీ.. థియేటర్లలో రిలీజ్ అవుతున్న మొదటి సినిమా ఇదే. సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల ఇందులో హీరోగా నటించాడు. సాక్షి మధోల్కర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ పై టి.జి.విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
వాస్తవానికి డిసెంబర్ 12నే ఈ సినిమా రిలీజ్ కావాలి.. కానీ గత వారం రిలీజ్ అవ్వాల్సిన ‘అఖండ 2’ పోస్ట్ పోన్ అయ్యి ఈ వారం రిలీజ్ అవుతుండటం వల్ల.. ఒకరోజు వెనక్కి వెళ్ళింది ‘మోగ్లీ’. డిసెంబర్ 13న ఈ సినిమా కానుంది. ఆల్రెడీ ఇండస్ట్రీకి చెందిన పెద్దలకి, సన్నిహుతులకి ‘మోగ్లీ’ స్పెషల్ షో వేసి చూపించారు నిర్మాత టి.జి.విశ్వప్రసాద్.సినిమా చూసిన అనంతరం వారు తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు.
వారి టాక్ ప్రకారం.. ‘మోగ్లీ’ సినిమా 2 గంటల 40 నిమిషాలు ఉందట. సినిమా ఇంట్రెస్టింగ్ గా మొదలైందట. వైవా హర్ష పాత్ర ఆకట్టుకునే విధంగా ఉందట. ఆ పాత్ర పలికిన డైలాగులు హిలేరియస్ గా అనిపిస్తాయట. హీరో, హీరోయిన్ లవ్ ట్రాక్ బాగానే ఉందట. ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ ఎమోషనల్ గా సాగిందని.. అయితే విలన్ సరోజ్ ఎంట్రీతో ఆసక్తిని రేకెత్తించినట్టు అంతా చెబుతున్నారు. సెకండాఫ్ మొత్తం ఆ పాత్ర డామినేషన్ ఓ రేంజ్లో ఉంటుందని.. ఒక రకంగా వన్ మెన్ షో ఫీలింగ్ కలుగుతుందని అంతా చెబుతున్నారు.
కాలభైరవ సంగీతంలో రూపొందిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటాయట. ఎమోషనల్ డైలాగ్స్ కూడా బాగా పేలాయని అంటున్నారు. దర్శకుడు సందీప్ రాజ్ రైటింగ్, ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ వంటివి ఆకట్టుకున్నాయని అంటున్నారు. మరి ప్రీమియర్ షోలు, రిలీజ్ రోజున ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి