Raayan Collections: ‘రాయన్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే?

తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) కెరీర్లో మైల్ స్టోన్ మూవీగా అంటే 50వ సినిమాగా రూపొందింది ‘రాయన్'(Raayan). ఈ చిత్రం స్పెషాలిటీ ఏంటంటే హీరో ధనుష్ దీనిని డైరెక్ట్ చేయడం. అలాగే ‘సన్ పిక్చర్స్’ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ధనుష్ తో పాటు ఈ చిత్రంలో సందీప్ కిషన్ (Sundeep Kishan )  , కాళిదాస్ జయరామ్ (Kalidas Jayaram) , అపర్ణ బాలమురళి (Aparna Balamurali) వంటి వారు కూడా కీలక పాత్రలు పోషించారు. టీజర్, ట్రైలర్స్ ఓకే అనిపించాయి.

జూలై 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి ద్వారా ఈ సినిమా తెలుగులో రిలీజ్ అయ్యింది. మొదటి రోజు సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ అదిరిపోయాయి అని చెప్పాలి. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.64 cr
సీడెడ్ 0.12 cr
ఉత్తరాంధ్ర 0.15 cr
ఈస్ట్ 0.08 cr
వెస్ట్ 0.03 cr
గుంటూరు 0.08 cr
కృష్ణా 0.09 cr
నెల్లూరు 0.04 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 1.23 cr

‘రాయన్’ చిత్రానికి తెలుగులో రూ.2.1 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.2.6 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. మొదటి రోజు ఈ సినిమా రూ.1.23 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.1.37 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus