Mrunal Thakur: మొన్న వచ్చింది అందుకేనా? ‘స్పెషల్’ విందు ఎలా ఉండబోతోందో మరి!

మృణాల్‌ ఠాకూర్‌ టాలీవుడ్‌లో సినిమా చేసి రెండేళ్లు అవుతోంది. 2024లో ఆఖరిగా ‘ఫ్యామిలీ స్టార్‌’ సినిమా చేశాక మళ్లీ ఇటువైపు రాలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో తెలుగు సినిమాలు రెండు ఉన్నాయి. అందులో ఓ సినిమా అఫీషియల్‌గా అనౌన్స్‌ అయినా.. ఇంకో సినిమాలో ఆమె ఉందనే మ్యాటర్‌ ఇంకా అధికారికంగా చెప్పలేదు. అయితే రీసెంట్‌గా మృణాల్‌ హైదరాబాద్‌ వచ్చి వెళ్లింది. అప్పుడు ఏదో సినిమా కథ వినడానికో, డీల్‌కో వచ్చింది అనుకున్నారంతా. కానీ అసలు కారణం ఇదీ అంటూ ఇంకో పాయింట్‌ బయటకు వచ్చింది.

Mrunal Thakur

అదే.. ఓ కొత్త టాలీవుడ్‌ సినిమాలో మృణాల్‌ని ఐటమ్‌ సాంగ్‌ కోసం అడిగారట. ఆ మాట కోసమో, లుక్‌ టెస్ట్‌ కోసమో మృణాల్‌ రీసెంట్‌గా భాగ్యనగరానికి వచ్చింది అని చెబుతున్నారు. రామ్ చరణ్ – బుచ్చిబాబు సానా – జాన్వీ కపూర్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘పెద్ది’ సినిమాలో ఓ ఐటమ్‌ సాంగ్‌ ఉందని చాలా రోజులుగా వార్తలొస్తున్నాయి. అందులో ఆడబోయే హీరోయిన్‌ ఎవరు అంటూ గత కొన్ని రోజులుగా చర్చ నడుస్తూనే ఉంది. దానికి మృణాల్‌ ఠాకూర్‌ దగ్గర ఫుల్‌స్టాప్‌ పడిందట. తొలుత ఈ పాట కోసం శ్రీలీల, సమంత లాంటి పేర్లు వినిపించినా..

ఈ పాట కోసం సంగీత దర్శకడు ఏఆర్ రెహమాన్ ఇప్పటికే హుషారైన మాస్ ట్యూన్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభించాలని బుచ్చిబాబు – రామ్‌చరణ్‌ అనుకుంటున్నారట. ఈ క్రమంలోనే మృణాల్‌ను హైదరాబాద్‌ పిలిపించారని సమాచారం. ఒకట్రెండు రోజుల్లో ఈ విషయంలో క్లారిటీ వస్తుంది అని చెబుతున్నారు. రామ్‌ చరణ్ మాస్ స్టెప్పులకు తోడు మృణాల్ గ్లామర్ తోడైతే థియేటర్లు ఊగిపోవడం పక్కా అని చెప్పొచ్చు.

ఇక ఈ సినిమాను మార్చి 27న విడుదల చేస్తామని టీమ్‌ పదే పదే చెబుతున్నా.. వాయిదా పుకార్లు అయితే కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. మే, జూన్‌ అంటూ వాయిదా డేట్స్‌ చెబుతున్నారు. కొత్త పాట రిలీజ్ ఈ నెలలోనే ఉంటుంది అన్నారు. అప్పుడు మరోసారి క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

మార్చి లాస్ట్‌ వీక్‌ వార్‌.. ఆ ఇద్దరూ ఆగితే.. ‘ఉస్తాద్‌’ వస్తాడా? ప్లాన్స్‌ రెడీనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus