Mrunal Thakur: టీమ్‌ నో చెబుతోంది.. ఈమె ఆయన పాటలు పెడుతోంది.. మృణాల్‌ ప్లానేంటి?

కొన్ని రిలేషన్‌షిప్స్‌ ఎప్పుడు ఎలా మొదలవుతాయో, ఎప్పుడు ఎలా ముగుస్తాయో తెలియదు. ఎందుకంటే అప్పటివరకు ఎక్కడా పెద్దగా కలుసుకోని ఇద్దరి గురింరి రిలేషన్‌ రూమర్స్‌ రావడం, ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం లాంటివి గతంలో ఒకట్రెండు సందర్భాల్లో చూశాం. ఆ తర్వాత ఏంటా అని ఎంక్వైరీ చేస్తే.. అందరికీ కనిపించేలా ఇద్దరూ కలవలేదు.. కానీ కలిసేవారు అని తెలిసింది. ఇప్పుడు ఇలానే జరుగుతుంది అని చెప్పలేం కానీ.. ధనుష్‌ – మృణాల్‌ ఠాకూర్‌ రిలేషన్‌ గురించి పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

Mrunal Thakur

ఈ క్రమంలో విషయం ఆమె వరకు చేరడంతో టీమ్‌తో క్లారిటీ ఇప్పించింది. సోషల్ మీడియాలో మృణాల్ ఠాకూర్ యాక్టివ్‌గానే ఉంటుంది. కానీ పెళ్లి వార్తలు విషయంలో గత కొన్ని రోజులుగా ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వలేదు. టీమ్‌ అయితే అలాంటిదేం లేదంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. అయితే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో షేర్ చేసింది మృణాల్. తను వెళ్లిన ఓ ట్రిప్‌ గురించి అందులో ఉంది. ‘గ్రౌండెడ్, గ్లోయింగ్, అడిగ్’ అని రాసుకొచ్చింది.

అందులో ఏముంది.. ఆమె మనసులో మాట రాసింది అనుకోవచ్చు. అయితే ఇక్కడ పాయింట్ ఆ వీడియోతో ఆమె అటాచ్‌ చేసిన పాటనే ఇప్పుడు పాయింట్‌ ఆఫ్‌ డిస్కషన్‌. హిందీ, తెలుగులో సినిమాలు చేసిన మృణాల్‌ ఆ వీడియోకు తమిళ పాట పెట్టడం ఏంటి.. ఆమెకు తమిళనాడు వ్యక్తి అంటే ఇష్టం కాబట్టి అలా పెట్టింది అని ఓ కథ అల్లేస్తున్నారు. ఆమెకు ఆ పాట నచ్చి పెట్టి ఉండొచ్చు. అయితే పుకార్ల వేళ ఇలా చేయడంతో వాటికి కాస్త ఆజ్యం పోసినట్లు అయింది.

కొన్ని రోజుల క్రితం ధనుష్‌తో మృణాల్‌ దిగిన ఓ సెల్ఫీ బయటకు వచ్చింది. ఆ తర్వాత ఇద్దరూ పలుమార్లు కలిసినట్లు వార్తలొచ్చాయి. ధనుష్‌ ఇటీవల విడాకులు అయిన తర్వాతే ఇదంతా జరగింది. అందుకే రిలేషన్‌ పుకార్లు వస్తున్నాయి. చూద్దాం పూర్తి స్థాయి క్లారిటీ ఎప్పుడొస్తుందో?

విశ్వంభర.. మెగాస్టార్ ముందున్న అసలైన సవాల్ ఇదే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus