Vishwambhara: విశ్వంభర.. మెగాస్టార్ ముందున్న అసలైన సవాల్ ఇదే!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా సక్సెస్‌ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అనిల్ రావిపూడి మార్క్ కామెడీతో వచ్చిన ఈ సినిమా ఇప్పటికే 250 కోట్ల వసూళ్లను దాటేసి, 300 కోట్ల క్లబ్ వైపు దూసుకుపోతోంది. అయితే ఈ జోష్ ఇలాగే కొనసాగాలంటే చిరంజీవి ముందు ఇప్పుడు ‘విశ్వంభర’ అనే ఒక భారీ టాస్క్ ఉంది. సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాను హిట్ ట్రాక్ లో నిలబెట్టడం ఇప్పుడు చిరుకు అత్యంత కీలకంగా మారింది.

Vishwambhara

దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నిజానికి 2025 సంక్రాంతికే రావాలి, కానీ గ్రాఫిక్స్ పనులు ఆలస్యం కావడంతో 2026 వేసవికి షిఫ్ట్ అయింది. ఈ మూవీలో దాదాపు 70 శాతం సీన్లు వీఎఫ్‌ఎక్స్ (VFX) తోనే ముడిపడి ఉన్నాయి. గతంలో వచ్చిన టీజర్ లోని విజువల్స్ పై కొన్ని నెగటివ్ కామెంట్స్ రావడంతో, ఇప్పుడు అవుట్‌పుట్ విషయంలో చిరంజీవి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతి ఫ్రేమ్ పర్ఫెక్ట్‌గా ఉండేలా ఆయన దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం చిరంజీవి బాబీ కొల్లి దర్శకత్వంలో మరో మాస్ సినిమాను స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఒక పక్క ఆ షూటింగ్‌లో పాల్గొంటూనే, మరోపక్క ‘విశ్వంభర’ పోస్ట్ ప్రొడక్షన్ పనులపై ఫోకస్ పెట్టడం చిరుకు ఒక పెద్ద టాస్కే అని చెప్పాలి. ‘వాల్తేరు వీరయ్య’ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన బాబీతో సినిమా అంటే అంచనాలు ఎలాగూ ఉంటాయి, కానీ ‘విశ్వంభర’ లాంటి విజువల్ వండర్ ను ఆడియన్స్‌కు నచ్చేలా ప్రెజెంట్ చేయడం ఇప్పుడు మెగాస్టార్ కు అసలైన పరీక్ష.

ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సినిమాలోని గ్రాఫిక్స్ పనుల కోసమే మేకర్స్ కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. క్వాలిటీ విషయంలో అస్సలు తగ్గకూడదని చిరంజీవి టీమ్‌కు గట్టిగా ఇన్ స్ట్రక్షన్స్ ఇచ్చారట. ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఇచ్చిన బూస్ట్‌తో చిరు ఈ సోషియో ఫాంటసీ మూవీని ఏ రేంజ్‌లో ప్రమోట్ చేస్తారో చూడాలి. సమ్మర్ 2026లో ఈ సినిమా థియేటర్లను షేక్ చేయడం ఖాయమనిపిస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus