టాలీవుడ్ లక్కీ చార్మ్ మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. తెలుగులో చేసిన తక్కువ సినిమాలతోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం రెడీ అయిపోయారు. సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా మృణాల్ క్యారెక్టరైజేషన్ బాగుంటే ఆడియన్స్ బ్రహ్మరథం పడుతుండటంతో, మన మేకర్స్ కూడా ఈమె డేట్స్ కోసం క్యూ కడుతున్నారు.
లేటెస్ట్ గా మృణాల్ సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. కొత్త ఏడాదిలో ఒక క్రేజీ స్క్రిప్ట్‌తో కొత్త జర్నీ స్టార్ట్ చేస్తున్నట్లు హింట్ ఇచ్చారు. ‘హలో హైదరాబాద్.. అంతా కొత్తగా ఉంది’ అంటూ ఆమె పెట్టిన పోస్ట్ చూస్తుంటే, మృణాల్ ఖాతాలో మరో ఇంట్రెస్టింగ్ తెలుగు సినిమా పడినట్లు క్లియర్ గా అర్థమవుతోంది. ప్రస్తుతం ఆమె సిటీలోనే ఉండి షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే మృణాల్ చేస్తున్న ఆ కొత్త సినిమా ఏంటనే దానిపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. అల్లు అర్జున్ అట్లీ కాంబోలో రాబోయే పాన్ ఇండియా ప్రాజెక్టులో మృణాల్ హీరోయిన్ అనే టాక్ గత కొద్ది రోజులుగా వినిపిస్తోంది. ఈ భారీ మూవీ షూటింగ్‌లో పాల్గొనేందుకే ఆమె హైదరాబాద్ వచ్చినట్లు కొందరు భావిస్తున్నారు. అయితే మృణాల్ తన పోస్ట్‌లో ‘కొత్త స్క్రిప్ట్’ అని మెన్షన్ చేయడంతో ఇది వేరే ప్రాజెక్ట్ అయ్యుంటుందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
ప్రస్తుతానికి ఈ బ్యూటీ అడివి శేష్‌తో కలిసి ‘డెకాయిట్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా ఉగాది కానుకగా మార్చి 19న విడుదల కానుంది. ఇందులో మృణాల్ తన యాక్షన్ పెర్ఫార్మెన్స్‌తో సరికొత్తగా కనిపించబోతున్నారు. హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ లాంటి సినిమాల తర్వాత ఆమె ఇమేజ్‌ను ఈ చిత్రం నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మృణాల్ సైన్ చేసిన ఆ కొత్త ప్రాజెక్ట్ కి దర్శకుడు ఎవరు, హీరో ఎవరు అనే వివరాలు ఇంకా సస్పెన్స్‌లోనే ఉన్నాయి. కేవలం ఒక్క పోస్ట్‌తోనే తన కొత్త సినిమాపై అందరి అటెన్షన్ డ్రా చేసిన ఈ టాలెంటెడ్ హీరోయిన్, త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చే అవకాశం ఉంది.