Mrunal Thakur: ఆ సన్నివేశాల్లో నటించే ఛాన్స్ లేదు.. మృణాల్ ఠాకూర్ క్లారిటీ ఇదే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ఒకరు. మృణాల్ ఠాకూర్ కు సీతారామం (Sita Ramam) , హాయ్ నాన్న (Hi Nanna) సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టగా ఫ్యామిలీ స్టార్ (The Family Star) సినిమా మాత్రం తీవ్రస్థాయిలో నిరాశపరిచింది. ఇంటెన్స్ కిస్సింగ్ సీన్స్, బెడ్ రూమ్ సీన్స్ లో నటించడం నాకు ఇష్టం ఉండదని మృణాల్ ఠాకూర్ వెల్లడించడం గమనార్హం. నేను అలాంటి సీన్స్ లో నటించడానికి నా పేరెంట్స్ కూడా ఒప్పుకోరని మృణాల్ ఠాకూర్ అన్నారు.

అందుకే మొహమాటం లేకుండా నో చెబుతానని ఆమె వెల్లడించారు. చాలామంది హీరోయిన్లు కథ డిమాండ్ చేస్తే గ్లామర్ రోల్స్ లో, ముద్దు సీన్స్ లో నటించడానికి సిద్ధమని చెబుతారు. అయితే మృణాల్ ఠాకూర్ మాత్రం ఆ హీరోయిన్లకు భిన్నంగా అడుగులు వేస్తూ ఆఫర్లను అందుకుంటున్నారు. ఒకప్పుడు సీరియళ్లలో నటించి సక్సెస్ సాధించిన ఈ బ్యూటీ ఇప్పుడు వరుస సినిమాలతో సత్తా చాటుతున్నారు. మృణాల్ ఠాకూర్ త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటిస్తారేమో చూడాల్సి ఉంది.

మృణాల్ ఠాకూర్ తర్వాత రోజుల్లో తన తల్లీదండ్రులకు కిస్ సీన్స్ కూడా వృత్తిలో భాగమేనని పాత్రలో ప్రాధాన్యత ఉన్నప్పుడు మాత్రమే చేస్తానని ఆమె తల్లీదండ్రులను ఒప్పించడం జరిగిందట. సీన్స్ కావాలని క్రియేట్ చేస్తే మాత్రం తాను ఆ సీన్స్ లో నటించే అవకాశం లేదని మృణాల్ ఠాకూర్ అభిప్రాయపడుతున్నారు. మృణాల్ ఠాకూర్ రేంజ్ అంతకంతకూ పెరగాలని రాబోయే రోజుల్లో తన స్థాయిని ఆమె మరింత పెంచుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మృణాల్ ఠాకూర్ రెమ్యునరేషన్ 3 కోట్ల రుపాయలకు అటూఇటుగా ఉందని తెలుస్తోంది. మృణాల్ ఠాకూర్ ఇతర భాషల్లో సైతం బిజీ కావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. సోషల్ మీడియాలో సైతం ఈ బ్యూటీ క్రేజ్ అంతకంతకూ పెంచుకుంటూ ఉండటం గమనార్హం. మృణాల్ ఠాకూర్ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus