Mrunal Thakur: ఒకప్పుడు బంధువుల అవమానం.. చెప్పి మరి కారు కొన్న మృణాల్!

మృణాళ్ ఠాకూర్ అనే పేరు ఇప్పుడు పరిచయం అవసరం లేకుండా పాన్‌ ఇండియా స్థాయిలో వినిపిస్తున్న ఒక సెన్సేషన్. మరాఠీ టెలివిజన్‌ సీరియల్స్‌తో యాక్టింగ్ కెరీర్ ప్రారంభించిన ఆమె, తరువాత మరాఠీ సినిమాల్లో మెరిసి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అక్కడ స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న మృణాళ్, తెలుగులో హను రాఘవపూడి దర్శకత్వంలో సీతారామం చిత్రంతో సీత పాత్రలో కనిపించి తెలుగు ప్రేక్షకుల మనసులను దోచేసింది ఈ బ్యూటీ. ఈ విజయంతో ఆమెకు టాలీవుడ్‌లో వరుస అవకాశాలు దక్కాయి.

Mrunal Thakur

ఇటీవల మృణాళ్ తన జీవితంలో జరిగిన ఒక భావోద్వేగ సంఘటనను పంచుకున్నారు. ఆర్థికంగా సాధారణ కుటుంబం కావడంతో, ఒక సందర్భంలో బంధువులు తమ కారులో తల్లిని కూర్చోబెట్టడానికి కూడా నిరాకరించారని, ఆ అవమానం తనను తీవ్రంగా బాధించిందని చెప్పారు. అదే రోజు తన తల్లికి ఖరీదైన కారు కొంటానని మాట ఇచ్చానని, ఆ మాటను నిలబెట్టుకుని మెర్సిడెస్‌ను కొనుగోలు చేశానని, తన కుటుంబంలో బెంజ్ కార్ కొన్న మొదటి వ్యక్తి తానేనని గర్వంగా వెల్లడించారు.

టాలీవుడ్‌లో ఆమె చివరిగా విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా కనిపించిన చిత్రం ఫ్యామిలీ స్టార్. ఈ చిత్రం ఆశించిన సక్సెస్‌ను సాధించకపోయినా, మృణాళ్ ప్రస్తుతం అడివి శేష్‌తో కలిసి నటిస్తున్న డెకాయిట్ కోసం సిద్ధమవుతున్నారు. మొదట క్రిస్మస్ విడుదలగా అనుకున్న ఈ చిత్రం, షూటింగ్ ఆలస్యంతో వచ్చే ఉగాది సందర్భంగా మార్చి 19, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 మరి ఏం చేయమంటావ్? గడ్డి పీకాలనా….?? ఘాటుగా రిప్లై ఇచ్చిన దర్శి

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus