‘సీతారామం’ చిత్రంతో సినీ అభిమానుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఆ మూవీలో తన అందానికే కాక నటనకు కూడా ఫుల్ మార్క్స్ పడ్డాయి అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. అయితే సీతారామం హిట్ తో మంచి మంచి అవకాశాలు మృణాల్ ను వెతుక్కుంటూ వచ్చాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే తనకు సక్సెస్ ను తెచ్చిపెట్టాయి. కాగా, సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా వరుస అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లలో వరుస సినిమాలతో దూసుకుపోతుంది మృణాల్. సినిమాలలో ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉంటుంది ఈ భామ. రీసెంట్ గా స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా పై మృణాల్ చేసిన కామెంట్స్ ఆన్లైన్లో ట్రేండింగ్ అవుతున్నాయి.
తనకు ప్రియాంక చోప్రా జీవిత ప్రయాణం అంటే ఎంతో ఇన్స్పిరేషన్ అని, తన లైఫ్ నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నానని చెప్పుకొచ్చింది. ఇంకా తనకు మరియు ప్రియాంక చోప్రా ఇద్దరిలో ఒక కామన్ పాయింట్ ఉంది అని అన్నారు. అదేంటంటే.. ఇద్దరం కూడా జీవితంలో కష్టకాలంలో ఎక్కడ కూడా వెనుక అడుగు వేయలేదని, సమస్యలకు ఎదురొడ్డి నిలబడ్డామని తెలిపింది. ప్రియాంక చోప్రా ఇంటర్వ్యూలు ఒకటి కూడా మిస్ కానని, తన మాటల్లో చాలా అర్ధం ఉంటుంది అని చెప్పింది. ప్రియాంక ముఖ్యంగా యువతకు ఇచ్చే విలువైన సూచనలు తనని ఎంతో ప్రభావితం చేశాయని చెప్పుకొచ్చింది. ప్రియాంక చోప్రా ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా ఈ రోజు గ్లోబల్ రేంజ్లో స్టార్ హీరోయిన్ గా ఎదగటం వెనుక తను తీసుకున్న డేరింగ్ నిర్ణయాలే కారణమని, అందుకే ప్రియాంక చోప్రా తనకు ఎప్పటికి ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అని కొనియాడింది.
ఇది ఇలా ఉండగా, రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ప్రతీష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ గ్లోబ్ ట్రాటర్ చిత్రమైన ‘వారణాసి’ చిత్రంలో ప్రియాంక చోప్రా మందాకినీ పాత్రలో ఫిమేల్ లీడ్ గా నటిస్తున్నారు.