Mrunal Thakur: హాయ్ నాన్న లో లిప్ లాక్ తో రెచ్చిపోయిన మృణాల్ ఠాకూర్!

దసరా’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత న్యాచురల్ స్టార్ నాని ఎలాంటి సినిమా తియ్యబోతున్నాడు అని అందరూ ఎదురు చూస్తుండగా, ‘హాయ్ నాన్న’ అనే ప్రాజెక్ట్ ని ప్రకటించాడు. శౌరవ్ అనే నూతన దర్శకుడు ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అవుతున్నాడు. ‘సీత రామం’ వంటి కల్ట్ క్లాసిక్ చిత్రం తర్వాత మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం ఇది. గత కొంత కాలం క్రితమే గ్లిమ్స్ వీడియో తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా ఇప్పుడు టీజర్ తో మన ముందుకు వచ్చింది.

ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ కి నాని తో పాటుగా సినిమాకి సంబంధించిన నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు హాజరు అయ్యారు. అయితే ఈ టీజర్ ఎలా ఉందో చూశాం. సాధారణంగా ఇలాంటి క్లాస్ మూవీస్ ఒక పేరున్న హీరో చేస్తే కొత్తదనం ని ఆశిస్తారు. కానీ ఈ టీజర్ లో అదే మిస్ అయ్యింది. చాలా కూల్ గా సింపుల్ గా అలా సాగిపోయింది కానీ, కొత్తదనం ఏమి కనిపించలేదు.

భార్య చనిపోయిన తర్వాత కూతుర్ని పెంచుకుంటున్న ఒక వ్యక్తికి ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. ఆమెతో ప్రేమలో పడుతాడు, చివరికి వీళ్లిద్దరు ఎలా పెళ్లి చేసుకున్నారు అనేదే స్టోరీ. మన చిన్న తనం నుండి ఇలాంటి కథలు ఎన్నో వచ్చాయి, అలాంటివి చూస్తూనే మనం పెరిగాము. కానీ డైరెక్టర్ శౌరవ్ స్క్రీన్ ప్లే విషయం లో కొత్తదనం ఉండేలా చూసుకున్నాడో లేదో చూడాలి.

ఇక సీతారామం చిత్రం లో ఎంతో పద్దతిగా కనిపించిన (Mrunal Thakur) మృణాల్ ఠాకూర్, ఈ సినిమాలో మాత్రం రెచ్చిపోయి మరీ రొమాన్స్ చేసింది. టీజర్ లోనే మూడు లిప్ లాక్ సన్నివేశాలు కనిపించాయి, ఇక సినిమాలో ఎన్ని ఉన్నాయో చూడాలి.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus