బాహుబలి ప్రీక్వెల్లో శివగామిగా బాలీవుడ్ నటీమణి

“బాహుబలి” చిత్రంలో ప్రభాస్, రాణాలు పోషించిన “బాహుబలి, భల్లాలదేవ”ల పాత్రల తర్వాత అందర్నీ అమితంగా ఆకట్టుకొన్న పాత్ర “శివగామి”. ఈ పాత్రలో రమ్యకృష్ణ స్క్రీన్ ప్రెజన్స్, ఆమె పలికించిన రౌద్రం సినిమాకి మెయిన్ ఎస్సెట్ గా నిలిచాయి. అయితే.. ఇటీవల ఎనౌన్స్ చేసిన “బాహుబలి ప్రీక్వెల్”లో మాత్రం రమ్యకృష్ణ ఉండడం లేదని తెలుస్తోంది. నిజానికి ఈ ప్రీక్వెల్ మొత్తం శివగామి పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఆనంద్ నీలకంఠ రాసిన “ది రైజ్ ఆఫ్ శివగామి” ఆధారంగా రూపొందనున్న ఈ సిరీస్ ను దేవకట్టా, ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేయనుండగా.. రాజమౌళి పర్యవేక్షించనున్నారు.

బాహుబలి కథకు ముందు శివగామి బాల్యం, ఆమె ఎదుగుదల ప్రధానాంశంగా ఈ వెబ్‌ సీరీస్‌ తెరకెక్కనుంది. ఈ వెబ్‌సీరీస్‌లో ప్రధాన పాత్ర శివగామిగా ఉత్తరాది నటి మృణాల్ ఠాకూర్‌ కనిపించనుంది.. కుంకుమ్‌ భాగ్య సీరియల్‌లో బుల్ బుల్‌ పాత్రలో ఆకట్టుకున్న మృణాల్ ప్రస్తుతం హృతిక్ రోషన్‌ హీరోగా తెరకెక్కుతున్న సూపర్‌ 30లో నటిస్తున్న‌ది.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ వెబ్‌ సీరీస్‌ను ఒక్కో భాష‌లో ఒక్కోక్క ద‌ర్శ‌కుడు డైరెక్ష‌న్ చేయ‌నున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus