ఆ రీజన్ వల్లే మహేష్ రాలేదన్న సుమంత్ అశ్విన్!

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్లలో ఒకరైన ఎం.ఎస్.రాజు నిర్మించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాయనే సంగతి తెలిసిందే. ఎం.ఎస్.రాజు తనయుడు సుమంత్ అశ్విన్ ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 7 డేస్ 6 నైట్స్ సినిమాలో తాను గడ్డంతో కనిపిస్తానని అన్నారు. సినిమాలో హీరో సమస్యల్లో ఉంటాడని అందుకే హీరో గడ్డంతో కనిపిస్తాడని ఆయన తెలిపారు. కమల్ హాసన్ కు ఉన్న స్టేచర్ కు విక్రమ్ కు ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదని సుమంత్ అశ్విన్ చెప్పుకొచ్చారు.

ఆసక్తి క్రియేట్ చేయకపోతే చిన్న సినిమాలకు, మీడియం రేంజ్ సినిమాలకు ప్లస్ కాదని ఆయన కామెంట్లు చేశారు. నాకు మరీ బెస్ట్ ఫ్రెండ్స్ అయితే లేరని సుమంత్ అశ్విన్ చెప్పుకొచ్చారు. ఆర్థికంగా నష్టం రావడం వల్ల చెన్నైలో ఉన్న కొన్ని ఆస్తులను నాన్న అమ్ముకోవాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. ఆ ఆస్తులు అమ్మిన సమయంలో తాను చాలా చిన్నవాడినని సుమంత్ అశ్విన్ పేర్కొన్నారు. గత నాలుగైదు సంవత్సరాల నుంచి నాన్న ఫిల్మ్ మేకింగ్ టెక్నిక్స్ ను నేర్చుకుని యంగ్ రైటర్స్ తో చర్చలు జరిపేవారని డర్టీ హరి సినిమాతో నాన్న ప్రూవ్ చేసుకున్నారని సుమంత్ అశ్విన్ తెలిపారు.

నాన్న మైండ్ లోంచి వచ్చిన లైన్ తో 7 డేస్ 6 నైట్స్ సినిమాను తెరకెక్కించామని సుమంత్ అశ్విన్ వెల్లడించారు. నాన్న నాకంటే మోడ్రన్ గా ఆలోచిస్తారని సుమంత్ అశ్విన్ పేర్కొన్నారు. ఎప్పుడూ హార్డ్ వర్క్ చేస్తూ రైట్ వే లో ఆలోచిస్తే సక్సెస్ సాధించడం సులువేనని సుమంత్ అశ్విన్ వెల్లడించారు. తొలి సినిమా నుంచి ప్రొడక్షన్ కాస్ట్ గురించి తాను ఆలోచించేవాడినని ఆయన తెలిపారు.

నా వల్ల టైమ్ వేస్ట్ కాకుండా నేను కష్టపడతానని సుమంత్ అశ్విన్ చెప్పుకొచ్చారు. నా సినిమాను ప్రమోట్ చేయాలని మహేష్ ను అడిగామని అయితే ఆయన యూరప్ లో ఉండటంతో రావడం కుదరలేదని సుమంత్ అశ్విన్ కామెంట్లు చేశారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus