‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా విజయోత్సవం ఇటీవల ఘనంగా జరిగింది. సినిమా టీమ్ అంతా కలసి ప్రత్యేక కార్యక్రమం చేసుకున్నారు. థియేటర్ల నుండి ఓటీటీకి సినిమాకి వచ్చాక ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా వైబ్ కొనసాగుతూనే ఉంది. దానికి తగ్గట్టుగానే సినిమా గెలుపు సంబరాలు చేసుకుంటున్నారు. ఇటీవల కాకినాడ పోర్ట్ ఛైర్మన్ కె.వి.రావు ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో చిరంజీవిని ఘనంగా సన్మానించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి, ఆ సినిమా నిర్మాతలు సుస్మిత కొణిదెల, సాహు గారపాటి కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. వారితోపాటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా ఈ వేడుకకు వచ్చారు. ప్రముఖ దర్శకులు కె.రాఘవేంద్రరావు, ఎ.కోదండరామిరెడ్డి, బి.గోపాల్, వి.వి.వినాయక్, బండ్ల గణేశ్.. ప్రముఖ నిర్మాతలు సి.అశ్వనీదత్, అల్లు అరవింద్, డి.సురేష్‌బాబుతోపాటు యువ దర్శకులు కేఎస్ రవీంద్ర (బాబీ), బుచ్చిబాబు సానా తదితరులు పాల్గొన్నారు.
థియేటర్లలో రికార్డులు సృష్టించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా రూ.350 కోట్లకుపైగా వసూళ్లను అందుకుంది. ఆ తర్వాత ఓటీటీలోనూ మంచి వ్యూయింగ్ మినిట్స్ రికార్డు అందుకుంది. ఈ నెల 28న టీవీ ప్రీమియర్‌కి సిద్ధమవుతోంది. మరి టీవీలో టీఆర్పీ ఎంత నమోదవుతుందో చూడాలి.