Toxic: ‘టికెట్‌’ అదిరిపోయాడుగా.. ‘టాక్సిక్‌’లో ఇతను చాలా స్పెషల్‌ అట!

‘టాక్సిక్‌’ సినిమాకు సంబంధించి అన్ని లుక్స్‌ టీమ్‌ రిలీజ్‌ చేసేసింది. అందులో రాయను చాలా వైలెంట్‌గా బోల్డ్‌గా ఓ వీడియోతో అనౌన్స్‌ చేసింది. ఆ వీడియో ఎఫెక్ట్‌ ఇప్పటికీ సోషల్‌ మీడియాలో, ఇండియన్‌ సినిమాలో ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. ఈ లోపు సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇప్పటివరకు సినిమా బో*ల్డ్‌ అంటూ నానా హంగామా చేసిన ఆ కొంతమంది ఇప్పుడు ఇంత వైలెన్సా అని అంటున్నారు. వీటి మధ్యలో టికెట్‌ను ఇంట్రడ్యూస్‌ చేసింది చిత్రబృందం. ఈ సినిమాలో టికెట్‌ చాలా స్పెషల్‌ అని కూడా చెబుతున్నారు.

Toxic

ఈ సినిమాలో రాయ అనే పాత్రలో యశ్‌ కనిపిస్తాడు అని ఫస్ట్‌ లుక్‌తో చెప్పేసింది టీమ్‌. అయితే ఈ సినిమాలో యశ్ మరో లుక్‌ ఉంది అంటూ అప్పటి నుండి రూమర్లు వస్తున్నాయి. వాటికి తగ్గట్టుగానే టికెట్‌ అనే పేరుతో మరో యశ్‌ను ఇంట్రడ్యూస్‌ చేసేశారు. మామూలుగా యశ్‌ను మనం గడ్డం లేకుండా చూడం. స్టార్‌ అయ్యాక చేసిన సినిమాల్లో గడ్డంతోనే కనిపించాడు. కానీ టికెట్‌ లుక్‌లో చిన్నపాటి గడ్డమే ఉంది. ఆ లెక్కన ఈ లుక్‌ ఫ్యాన్స్‌కి కొత్తదే.

ఈ క్రమంలో ‘టాక్సిక్’ సినిమాలో యశ్ డ్యూయల్ రోల్ చేస్తున్న రూమర్‌ కన్‌ఫామ్‌ అయింది. రాయ ఏం చేస్తాడు అనేది సినిమా టీజర్‌లోనే చూసేశాం. ఇక టికెట్‌ ఏం చేస్తాడు అనేది తెలియాలంటే మార్చి 19 వరకు ఆగాల్సిందే. అప్పుడు ఐదుగురు హీరోయిన్లతో కలసి రాయ అండ్‌ టికెట్‌ థియేటర్లకు వస్తారు. గీతూ మోహన్‌ దాస్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ నిర్మిస్తోంది. ‘కేజీయఫ్‌’ సినిమాల తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి.

షారుఖ్‌ ఖాన్‌కి ఇచ్చేంత ఇస్తామన్నా.. పవన్‌ ఓకే చెప్పలేదట..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus