తనకున్న వ్యాధి గురించి బయటపెట్టిన ముమైత్ ఖాన్.!

“ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే” అంటూ పోకిరి సినిమాలో ముమైత్ ఖాన్ చేసిన పాట బాగా పాపులర్ అయింది. ఒక్క పాటతోనే బోలెడు అవకాశాలు దక్కించుంది. ఆ తర్వాత పోటీలో వెనుకపడ్డా.. బిగ్ బాస్ తెలుగు సీజన్ వన్ లో పాల్గొని ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా దగ్గరైంది. అయితే తాజాగా ఆమె గురించి ఓ విషయం బయటికి వచ్చింది. ముమైత్ కి అవకాశాలు తగ్గడానికి, ముంబై వెళ్ళిపోడానికి కారణం పరిశ్రమలో పోటీ కాదని ఆమెకి వచ్చిన వ్యాధి అని తెలిసింది. ఈ సంగతిని స్వయంగా ఆమె సోషల్ మీడియాలో వెల్లడించింది.

“నేను గత రెండేళ్లుగా మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నాను. అధిక బరువులు మోయవద్దని డాక్టర్లు సూచించారు. వారి సూచనల మేరకు చికిత్సను తీసుకుంటున్నాను. మూర్ఛవ్యాధిని తగ్గించే లిపివిల్ అనే మందు తీసుకోవడం వల్ల నేను లావెక్కుతున్నాను” అని వివరించింది. ఇంకా ఆమె పోస్టులో ఏమి చెప్పిందంటే … “పెరిగిన బరువు నాకు సమస్య కాదు. అనుకున్న టైంలో అనుకున్న శరీరాకృతిని సాధించే సత్తా, నమ్మకం నాకు ఉంది.” అని స్పష్టం చేసింది. కథానాయికలు స్పెషల్ సాంగ్స్ చేసేస్తుంటే.. ముమైత్ కి ఐటెం సాంగ్ అవకాశం వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.  మరి ఏ విధంగా వెండితెరపై రీ ఎంట్రీ ఇస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus