ముమైత్ ఖాన్ గురించి ఎవ్వరికీ తెలియని షాకింగ్ విషయాలు..!

ఐటెం సాంగ్స్ చేస్తూనే హీరోయిన్లతో సమానమైన క్రేజ్ ను సంపాదించుకుంది ముమైత్ ఖాన్. ‘ఛత్రపతి’ ‘పోకిరి’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ఆమె చేసిన ఐటెం సాంగ్స్ క్లిక్ అవ్వడంతో ఈమె డిమాండ్ కూడా విపరీతంగా పెరిగింది. గతంలో ఒకానొక సినిమాలో ఒక్క పాట చెయ్యడానికే రూ.40లక్షల నుండీ రూ.50 లక్షల వరకూ ఈమె పారితోషికాన్ని డిమాండ్ చేసింది. అయినప్పటికీ దర్శకనిర్మాతలు ఒప్పుకుని ఆమె అడిగినంత ఇచ్చారు అంటే.. ఈమె క్రేజ్ అప్పట్లో ఎలా ఉండేదో అర్ధం చేసుకోవచ్చు.అంతేకాకుండా ‘ఆపరేషన్ దుర్యోధన’ ‘మైసమ్మ ఐ.పి.ఎస్’ వంటి చిత్రాలతో నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది.

అటు తరువాత కూడా చాలా సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసింది. అంతేకాకుండా ‘బిగ్ బాస్ సీజన్1’ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి అదరకొట్టింది. ఇదిలా ఉండగా.. ఇటీవల ఈమె పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తన గురించి ఓ షాకింగ్ నిజాన్ని బయటపెట్టింది ముమైత్ ఖాన్. ఆమె మాట్లాడుతూ.. “గతంలో కొరియోగ్రాఫర్ రెమో .. నా గురువు.అతనితో కలిసి నేను చాలా డాన్స్ షోలు చేసాను. మేము చేసిన ఓ టీవీ షోకు.. 750 రూపాయలు నాకు పారితోషికంగా ఇచ్చారు. ఆ టైములో మా ఆర్ధిక పరిస్థితి సరిగ్గా ఉండేది కాదు కాబట్టి.. మా అమ్మ ఒప్పుకుందిగానీ లేకుంటే అస్సలు ఒప్పుకునేది కాదు.

కొన్నాళ్ల తరువాత ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’ సినిమా కోసం రూ.30 వేల పారితోషికం అందుకున్నాను. నాకు మంచి క్రేజ్ వచ్చింది అనుకున్న టైములో.. నేను వాష్ రూమ్ లో జారిపడిపోయాను. దాంతో నా తలకి బలమైన గాయం అయ్యింది. 15 రోజుల పాటు కోమాలోకి వెళ్లి పోయాను… బ్రెయిన్ కు సంబంధించిన 5 నరాలు దెబ్బతినడంతో నాకు ఆపరేషన్ చేశారు. 20 శాతం మాత్రమే నేను బ్రతికే ఛాన్స్ ఉందని డాక్టర్లు చెప్పారు.నా లక్ కొద్దీ బ్రతికాను .. ఇలా మీ ముందు నిలబడగలిగాను” అంటూ చెప్పుకొచ్చింది ముమైత్ ఖాన్.


పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus