నా పేరు సూర్య ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.!

దువ్వాడ జగన్నాథం తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేసిన సినిమా నా పేరు సూర్య. యాంగ్రీ సోల్జర్ గా బన్నీ చేసిన ఈ మూవీ టీజర్, ట్రయిల్ చూస్తుంటే అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. మరి వారి అంచనాలను ఈ మూవీ అందుకుందా? లేదా? అనే విషయాన్నీ దుబాయ్ సెన్సార్ విభాగంలో పనిచేస్తున్న ప్రముఖ సినీ విశ్లేషకుడు వివరించారు. అతను అందించిన ఫస్ట్ రివ్యూ మీ కోసం…

కథకిక్, రేసు గుర్రం, టెంపర్ వంటి సూపర్ హిట్ చిత్రాలకు కథను అందించిన వక్కంతం వంశీ తాను డైరక్టర్ చేసే సినిమాకి మంచి కథనే రాసుకున్నారు. ప్రతి భారతీయుడు కనెక్ట్ అయ్యే విధంగా దేశభక్తి ని నింపారు. దేశాన్ని సొంత ఇల్లుగా భావించే ఓ సోల్జర్.. తన దేశానికి నష్టం కలిగించే వారిని ఎలా ప్రాణాలకు తెగించి ఎదుర్కొంటాడు. ఎలా దేశాన్ని రక్షించుకుంటారనేది కథ.

అల్లు అర్జున్ యాక్షన్ఇప్పటి వరకు స్టైలిష్ స్టార్ గా అనిపించుకున్న అల్లు అర్జున్ ఈ చిత్రంతో యాక్షన్ స్టార్ కూడా అని పిలుపించుకుంటారు. అంతలా ఇందులో స్టంట్స్ చేశారు. పాటల్లో తన స్టైల్ ని వదల్లేదు. లవర్ ఆల్సో.. ఫైటర్ ఆల్సో అన్న రీతిలో వినోదాన్ని అందిస్తూనే దేశభక్తిని చాటారు. అత్యద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు.

అను ఇమ్యానుయేల్ అందంసీరియస్ గా సాగె కథలో అను ఇమ్యానుయేల్ అందం ప్రేక్షకులకు రిలీఫ్ ని ఇచ్చింది. బన్నీ, అను మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ఇదివరకు సినిమాలకంటే మంచిగా నటించడంతో పాటు గ్లామర్ డోస్ ని కూడా అను పెంచింది.

భారీ తారాగణంకేవలం హీరో, హీరోయిన్, విలన్ అని ముగ్గురికి ప్రయారిటీ ఇవ్వకుండా ఇందులో అనేక క్యారెక్టర్స్ కీలకం అయ్యాయి. అర్జున్, బోమన్ ఇరానీ, రావు రమేష్, నదియా, శరత్ కుమార్, ప్రదీప్ రావత్.. వీరందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. సినిమాకి బలమయ్యారు.

వావ్ డైరక్షన్రచయిత మెగా ఫోన్ పట్టుకుంటే ఎలా ఉంటుందో కొరటాల శివ అందరికీ వెండితెరపై చూపిస్తున్నారు. అదే విధంగా వక్కంతం వంశీ తనలో దాగిన డైరక్టర్ ని ఈ సినిమా ద్వారా చూపించారు. సీనియర్ డైరక్టర్స్ మాదిరి డైరక్ట్ చేశారు. కొన్ని సన్నివేశాలను చూస్తున్నప్పుడు హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుందంటే అతిశయోక్తి కాదు.

సినిమాటోగ్రఫీ మ్యాజిక్బాలీవుడ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రాజీవ్ రవి తన ప్రతిభతో సినిమాకి రిచ్ లుక్ తీసుకొచ్చారు. వేలెత్తి చూపించని విధంగా ఫ్రేమ్స్ సెట్ చేశారు.

సంగీతం ప్రాణంబాలీవుడ్ సంగీత ద్వయం విశాల్-శేఖర్ లు బన్నీని దృష్టిలో పెట్టుకోకుండా తనదైన శైలిలో సంగీతాన్ని అందించారు. పాటలు కొత్తగా.. ఆకట్టుకుంటున్నాయి. అలాగే నేపథ్య సంగీతం కథకి ప్రాణం పోసింది. మొదటి నుంచి సినిమాలోకి మనల్ని సంగీతం ఇన్వాల్వ్ చేసింది.

చివరి మాటబన్నీ నుంచి హాస్యాన్ని కోరుకునే వారికి నా పేరు సూర్య కొంచెం నిరాశపరుస్తుంది. యాక్షన్ ప్రియులకు భోజనం లాంటిది. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరిలో సోల్జర్స్ పై గౌరవం మరింత పెరుగుతుంది.

ఈ రివ్యూ ప్రముఖ సినీ క్రిటిక్ ట్వీట్ ని ఆధారం చేసుకొని రాసింది. ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఫిల్మ్ ఫోకస్ రివ్యూ, రేటింగ్ రేపు రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus