Naari Review in Telugu: నారి సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • NA (Hero)
  • ఆమని (Heroine)
  • నిత్యశ్రీ, వికాస్ వశిష్ట, కార్తికేయ దేవ్, మౌనిక రెడ్డి తదితరులు.. (Cast)
  • సూర్య వంటిపల్లి (Director)
  • శశి వంటిపల్లి (Producer)
  • వినోద్ కుమార్ విన్ను (Music)
  • భీమ్ సాంబా (Cinematography)
  • Release Date : మార్చి 07, 2025

మహిళా దినోత్సవం (మార్చ్ 7) సందర్భంగా విడుదలైన చిత్రం “నారి”. ఓ సీరియస్ టాపిక్ ను అడ్రెస్ చేస్తూ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఆమని కీలకపాత్ర పోషించగా.. నిత్యశ్రీ, కార్తికేయ దేవ్ ముఖ్యపాత్రలు పోషించారు. సూర్య వంటిపల్లి దర్శకుడిగా పరిచయమవుతూ స్వీయ నిర్మాణంలో రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుంది అనేది చూద్దాం..!!

Naari Review

కథ: తనకు తెలియకుండా జరిగిన ఓ తప్పు కారణంగా జీవితం పాడయ్యి.. తనలా మరొకరికి జరగకూడదు అనే ధ్యేయంతో ఊహించని నిర్ణయం తీసుకుంటుంది భారతి (ఆమని). ఆమె తీసుకున్న నిర్ణయం ఆడవాళ్లపై జరుగుతున్న అకృత్యాలను, ఆ దారుణాలు చేసే మగాళ్లను ఎలా ఎఫెక్ట్ చేసింది? అనేది “నారి” కథాంశం.

నటీనటుల పనితీరు: ఆమని ఇప్పటివరకు చాలా వైవిధ్యమైన పాత్రలు పోషించారు. అయితే.. “నారి” చిత్రంలో ఆమె పోషించిన భారతి పాత్ర మాత్రం ఆమె కెరీర్ లో ఒక కలికితురాయిగా నిలిచిపోతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఆమె నటన చిన్నపాటి వణుకు పుట్టించడమే కాక, ఆలోచింపజేస్తుంది కూడా.

నిత్యశ్రీ పాత్ర చిన్నదే అయినా.. మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. కార్తికేయ దేవ్ స్క్రీన్ ప్రెజన్స్ బాగుంది. అతడి పాత్ర ద్వారా ఎలివేట్ అయిన మెసేజ్ కూడా బాగుంది. మౌనిక రెడ్డి మంచి నటనతో పాత్రకు న్యాయం చేసింది.

వికాస్ వశిష్ట పాత్ర రెగ్యులర్ విలన్ రోల్ అయినప్పటికీ.. అందులో అతడు పండించిన విలనిజం కొత్తగా ఉండేలా అతడు తీసుకున్న కేర్ బాగుంది. అయితే.. ఆ క్యారెక్టర్ ను ఇంకాస్త బెటర్ గా ఎక్స్ప్లోర్ చేసి ఉంటే బాగుండేది.

ప్రగతి, కేదార్ శంకర్, సునయన, ప్రమోదిని తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు సూర్య వంటిపల్లి ఎంచుకున్న కథలో బలమైన సందేశం ఉంది. క్లైమాక్స్ లో సదరు సందేశాన్ని ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోయేలా తెరకెక్కించిన విధానం ప్రశంసనీయం. ఆమనిలోని సరికొత్త యాంగిల్ ను ప్రేక్షకులకు పరిచయం చేశాడు. దర్శకుడిగా ఆకట్టుకున్న సూర్య కథకుడిగా మాత్రం అలరించలేకపోయాడు. చెప్పాలనుకున్న మెసేజ్ & క్లైమాక్స్ షాక్ వేల్యు మీద పెట్టిన శ్రద్ధలో కొంచం ఎంగేజ్ చేసే కథనంలో పెట్టి ఉంటే “నారి” కచ్చితంగా ఒక మంచి సినిమాగా నిలిచేది.

వినోద్ కుమార్ పాటలు బాగున్నాయి. ముఖ్యంగా ఆర్పీ పట్నాయక్, సునీత పాడిన పాటలు హృద్యంగా ఉన్నాయి. అయితే.. నేపథ్య సంగీతంతో ఎమోషన్స్ ను ఎలివేట్ చేయడంలో మాత్రం విఫలమయ్యాడు.

సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉంది. అయితే.. బడ్జెట్ ఇష్యూస్ కనిపిస్తూనే ఉన్నాయి. కలరింగ్ & డి.ఐ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉండాల్సింది. ప్రొడక్షన్ డిజైన్ విషయంలో వెనుకాడకుండా ఉండి ఉండే బెటర్ అవుట్ పుట్ వచ్చేది.

విశ్లేషణ: స్త్రీ సమస్యల గురించి, వాళ్లు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి ప్రతి సినిమాలోనూ ఏదో ఒక చోట చర్చించడం అనేది జరుగుతూనే ఉంటుంది. చాలా అరుదుగా ఆ సమస్యను అధిగమించడానికి కావాల్సిన పరిష్కారాన్ని తెరపై చూపిస్తుంటారు. “నారి”లో చూపిన పరిష్కారం కచ్చితంగా సమాజానికి అవసరమే. ఆమని పాత్రతో చెప్పించిన అ సమాధానం కచ్చితంగా ఒక హార్డ్ హిట్టింగ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. అయితే.. కథనం విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని, కాస్త బెటర్ క్వాలిటీ అవుట్ పుట్ ఇచ్చి ఉంటే కచ్చితంగా మంచి సినిమాగా నిలిచేది.

ఫోకస్ పాయింట్: ఆలోచింపజేసే మంచి ప్రయత్నం!

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus