మెగాబ్రదర్ నాగబాబు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా రిజల్ట్ గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వకీల్ సాబ్ సినిమాను చూసిన నాగబాబు సినిమాపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చాలా రోజుల తర్వాత తాను థియేటర్ కు వెళ్లి సినిమా చూశానని నాగబాబు అన్నారు. వకీల్ సాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ నటించలేదని రియల్ లైఫ్ లో పవన్ ఎలా ఉంటారో ఈ సినిమాలో కూడా అలాగే ఉన్నారని నాగబాబు పేర్కొన్నారు.
దాదాపు మూడు సంవత్సరాల విరామం తర్వాత పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని నాగబాబు తెలిపారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన అత్తారింటికి దారేది సినిమా తరువాత పవన్ కళ్యాణ్ సినిమాలను ఎక్కువగా చూడలేదని నాగబాబు పేర్కొన్నారు. అజ్ఞాతవాసి సినిమా రిజల్ట్ తమను ఎంతగానో బాధించిందని నాగబాబు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వకీల్ సాబ్ మూవీ బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వకపోవడం గురించి నాగబాబు స్పందించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇలాంటి పనులు చేసే వ్యక్తి కాదని తాను భావిస్తున్నానని నాగబాబు తెలిపారు.
ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ జగన్ ఎంతో బిజీగా ఉన్నారని కొంతమంది స్థానిక ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు వకీల్ సాబ్ బెనిఫిట్ షోలను నిలిపివేసి ఉంటారని తాను భావిస్తున్నానని నాగబాబు అన్నారు. వకీల్ సాబ్ సినిమా బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలకు సంబంధించి అనుమతులు రాలేదనే విషయం జగన్ దృష్టికి వస్తే ఆయన కచ్చితంగా స్పందించే అవకాశం ఉందని నాగబాబు పేర్కొన్నారు. సినిమాల విషయంలో ఇలాంటి ఇబ్బందులను క్రియేట్ చేస్తే సినిమాపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు నష్టపోయే అవకాశం ఉందని నాగబాబు తెలిపారు.
Most Recommended Video
‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!