నీ డొల్లతనం బయటపడింది ప్రకాష్: నాగబాబు
- November 28, 2020 / 06:35 PM ISTByFilmy Focus
కొట్టినా.. పెట్టినా అమ్మే అనే సామెత నాగబాబుకు సరిగ్గా సరిపోతుంది. పవన్ కళ్యాణ్ ను తిట్టినా ఆయనలా ఎవరూ తిట్టలేరు. అలాగే పొగిడిన, సపోర్ట్ చేసినా ఆయన స్థాయిలో ఎవరు చేయలేరు. తమ్ముడి కోసం అన్న అహరహం శ్రమించే విధానం ఒక్కోసారి మెచ్చుకోలుగా ఉంటె, ఎక్కువసార్లు చులకన చేయబడతాయి. అయితే.. నిన్న ప్రకాష్ రాజ్ రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఓ ఊసరవెల్లి అని కామెంట్ చేయడం పెద్ద దుమారాన్ని రేపింది.
ప్రకాష్ రాజ్ కూడా కర్ణాటకలో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిపోయినా.. ఒంటరిగా సోషల్ మీడియా వేదికగా బీజేపీపై యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే బీజేపీకి వెన్నుకాస్తున్న పవన్ కళ్యాణ్ మీద కూడా ప్రకాష్ రాజ్ తీవ్రమైన కామెంట్స్ చేసాడు. పవన్ రాజకీయ ప్రస్థానాన్ని ఎద్దేవా చేశారు. ఈ విషయమై నాగబాబు ఘాటుగా స్పందించారు. ప్రకాష్ రాజ్ వి కుహానా రాజకీయాలని, అసలు ప్రకాష్ ఏం చేస్తున్నాడో అతనికే క్లారిటీ లేదని,

దేశ భవిష్యత్ ను కాపాడడం కోసమే పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడని నాగబాబు తన తోటి నటుడిపై ప్రకాష్ రాజ్ పై తీవ్రస్థాయిలో మండిపడుతూ.. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ను వెనకేసుకొచ్చాడు. ఈ విషయంలో నాగబాబుని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నెత్తి మీద పెట్టుకొంటున్నప్పటికీ.. ఇంకొందరు మాత్రం ఎప్పట్లానే కామెడీ చేస్తున్నారు.
Most Recommended Video
బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

















