చిరంజీవికి ఘోరఅవమానం…నాగబాబు చెప్పిన కథనం!

హీరో కావాలనుకునే ప్రతి ఒక్కరికి చిరంజీవి ఒక రోల్ మోడల్. తపన, టాలెంట్ ఉంటే స్టార్ గా ఎదగడం అసంభవం కాదని నిరూపించారు. ఎటువంటి సప్పోర్ట్ లేకుండా పరిశ్రమలోకి ప్రవేశించి మహా శక్తిగా ఎదిగారు. ఎవర్ గ్రీన్ హీరోగా దశాబ్దాలుగా వెండితెరను ఏలుతున్నారు. మరి అలాంటి చిరంజీవి కెరీర్ బిగినింగ్ లో అనేక అవమానాలు ఎదుర్కొన్నారట. నటుడిగా గుర్తింపు రాకముందు అనేక మంది ఆయనను చులకనగా చూశారట. అలాంటి ఓ సందర్భాని చిరంజీవి తమ్ముడు నాగబాబు తెలియజేశారు.

చెన్నైలో నటనలో శిక్షణ తీసుకుంటున్న చిరంజీవికి పురాణం సూరి అనే మిత్రుడు ఉండేవాడట. ఆయన తన ఫ్యామిలీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఓ స్టార్ హీరో మూవీ ప్రివ్యూ చూడడానికి చిరంజీవిని ఆహ్వానించారట. ఆ ప్రివ్యూ చూడడానికి మిత్రులతో కలిసి వెళ్లిన చిరంజీవి మొదటి వరసలో కుర్చున్నారట. ఆ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ గా ఉన్న పురాణం సూరి కుటుంబానికి చెందిన బంధువులు రావడంతో వారు చిరంజీవిని మరియు అతని మిత్రులను వెళ్లి వెనుక కూర్చో అని లేపి పంపేశారట.

దానితో చిరంజీవి అవమానంగా భావించి బయటికి వచ్చేశారట. ఆ విషయం తెలుసుకున్న సూరి, వాళ్ళు అంతే నువ్వు బాధపడకు, నీ టాలెంట్ కి పెద్ద హీరో అవుతావ్ అన్నారట. అప్పుడే చిరంజీవిలో హీరో కాదు నంబర్ వన్ హీరో అవ్వాలనే కసి పెరిగిందట. ఈ సంఘటనను నాగబాబు చెప్పడం జరిగింది.

Episode-1

Episode-2

Episode-3

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus