వ్యాపార రంగం వైపు అడుగులు వేస్తున్న నాగ చైతన్య..?

గ్లామర్ కి కేర్ ఆఫ్ అడ్రెస్స్ అంటే అక్కినేని ఫ్యామిలీ అనే చెబుతుంటారు. మాస్ చిత్రాలకన్నా లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటెర్టైనెర్స్ తోనే స్టార్ ఫ్యామిలీలో ఒకటి గా నిలదొక్కుకుంది ఈ ఫ్యామిలి. ఈ ఫ్యామిలి అంతా సినిమాల విషయాలలోనే కాకుండా… బిజినెస్ రంగంలో కూడా వెల్ ప్లాన్డ్ గా వుంటారనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పట్లో ఏఎన్ఆర్ గారు హీరోగా సినిమాల్లో నటిస్తూనే రైస్ మిల్లులు, కలప వ్యాపారం వగైరా రంగంలో రాణించారు. ఇక అటు తరువాత అన్నపూర్ణ స్టూడియోస్ ను స్థాపించి ఎన్నో చిత్రాలు నిర్మించారు.

ఇక ఆయన వారసుడు అక్కినేని నాగార్జున కూడా రియల్ ఎస్టేట్, రెస్టారెంట్లు, ఇతరత్రా వ్యాపార రంగాల్లో రాణించారు. నాగ్ కూడా ఒక పక్క హీరోగా నటిస్తూనే.. నిర్మాతగా కూడా అనేక సూపర్ హిట్ చిత్రాల్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నాగార్జున పెద్దకుమారుడు నాగ చైతన్య కూడా ఇదే మార్గంలో నడుస్తున్నట్టు తెలుస్తుంది. నాగ చైతన్య సొంతంగా ఇటీవల స్టూడియోలో ఓ వింగ్ స్టార్ట్ చేసారు. ఇక తాజాగా వైజాగ్ లో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు కూడా స్టార్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. వైజాగ్ రిమోట్ ఏరియాల్లో అయినా సరే… కాస్త తక్కువగా వచ్చే భూములయినా… కాస్త పెద్ద సంఖ్యలో కొనే ఆలోచనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ విషయమై… ముందుగా కొద్ది కొద్దిగా స్టార్ట్ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా.. నాగ చైతన్య కూడా ఓ పక్క సినిమాలు చేస్తూనే… మరో పక్క బిజినెస్ రంగం వైపు కూడా అడుగులు వేస్తూ.. వారసత్వాన్ని కొనసాగిస్తుండడం విశేషం..అంతే కాదు ఈ మధ్య కాలంలో మహేష్, ప్రభాస్ మల్టీప్లెక్స్ ల బిజినెస్ వైపు అడుగులు వేస్తుండగా.. ఇప్పుడు ఈ క్రమంలో నాగ చైతన్య కూడా జాయిన్ అయ్యాడన్న మాట..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus