సినిమాల ద్వారా మంచి జోడీగా పేరు సంపాదించుకున్న చైతన్య సమంత పెళ్లి తర్వాత కూడా క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు. చైతన్య సమంతల జోడీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. పెళ్లి తర్వాత చైతన్య, సమంత కలిసి నటించిన మజిలీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అటు ఆన్ స్క్రీన్ లో ఇటు ఆఫ్ స్క్రీన్ లో బెస్ట్ జోడీగా పేరు సొంతం చేసుకున్న చైసామ్ విడాకుల ప్రకటనతో సాధారణ ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు సైతం షాకయ్యారు.
ఏ మాయ చేశావె సినిమాతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సొంతం చేసుకున్న సమంత పదేళ్లుగా వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్నారు. అయితే చైతన్య, సమంత విడిపోయినట్లు ప్రకటన చేయడంతో వీళ్లిద్దరూ మళ్లీ కలిసి నటించే అవకాశం అయితే దాదాపుగా లేనట్టేనని సమాచారం. తెరపై చైతన్య సమంతలను జంటగా చూడాలని అనుకునే వాళ్లకు నిరాశ తప్పదని తెలుస్తోంది. ఫిల్మ్ మేకర్స్ సైతం చైసామ్ లను ఒకే సినిమాలో చూపించే ప్రయత్నం చేయకపోవచ్చు.
సమంత, చైతన్య ఒకే ఈవెంట్ లో కనిపించడం కూడా జరగదని తెలుస్తోంది. కాలం ఎంత మారినా చైతన్య, సమంత ప్రొఫెషనల్స్ అయినా వివాహ బంధం తెగిపోవడంతో కలిసి నటించడానికి చైతన్య సమంత ముందుకు వచ్చే అవకాశాలు అయితే లేవని తెలుస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండని నాగచైతన్య విడాకుల ప్రకటన తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ కావడం గమనార్హం.
Most Recommended Video
హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!