Naga Chaitanya, Samantha: సమంత నాగచైతన్య విడాకులకు ఈ గాసిప్ కారణమా?

  • July 1, 2023 / 02:52 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ కపుల్ గా ఎంతో మంచి గుర్తింపు పొందిన సమంత నాగచైతన్య కేవలం మూడు సంవత్సరాలు పాటు తమ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండి అనంతరం విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా వీరిద్దరు విడాకులు తీసుకుని దాదాపు రెండు సంవత్సరాలు పూర్తి అవుతున్నప్పటికీ ఇంకా నాగచైతన్య సమంత విడాకుల గురించి ఏదో ఒక సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.ప్రేమించే పెళ్లి చేసుకున్నటువంటి నాగచైతన్య సమంత విడిపోవడానికి కారణం ఏంటి అన్న సందేహం అందరిలోనూ ఏర్పడింది.

ఇలా వీరిద్దరు విడాకులు తీసుకోవడానికి గల కారణాన్ని తాజాగా (Naga Chaitanya) నాగచైతన్య తన కస్టడీ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బయటపెట్టిన విషయం మనకు తెలిసిందే.మేమిద్దరం విడాకులు తీసుకొని విడిపోవడానికి సోషల్ మీడియాలో వచ్చిన గాసిప్స్ కారణమని నాగచైతన్య తెలియజేశారు. ఈ విధంగా వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయే అంత పెద్ద గాసిప్ ఏంటి అనే విషయం విషయం గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే తాజాగా నాగచైతన్య సమంత విడాకులకు ఈ గాసిప్ కారణమని తెలుస్తోంది.

పెళ్లి తర్వాత కూడా సమంత వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడిపారు. అలాగే ఈమె సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్లలో కూడా నటించిన విషయం మనకు తెలిసిందే. ముఖ్యంగా ది ఫ్యామిలీ మెన్ 2వెబ్ సిరీస్ లో సమంత తన నటనతో అదరగొట్టింది. ఇందులో ఈమె బోల్డ్ సన్నివేశాలలో కూడా నటించిన విషయం మనకు తెలిసిందే. అయితే పెళ్లి తర్వాత ఇలాంటి సీన్స్ చేయడానికి ఏ భర్త కూడా ఒప్పుకోడు నాగచైతన్య కూడా ఇందుకు నిరాకరించారట.

ఇలాంటి సన్నివేశాలలో తాను నటించకూడదని తన స్థానంలో డూప్ పెట్టాలని నాగచైతన్య చెప్పినప్పటికీ సమంత వినకుండా ఈ సీన్స్ లో నటించిందనే వార్త వైరల్ గా మారింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలై విడాకుల వరకు వెళ్లారని తెలుస్తుంది. కానీ అక్కడ సమంత కాకుండా తన స్థానంలో డూప్ నటించారన్న విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని అయితే అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయిందని తాజాగా సమంత నాగచైతన్య విడాకుల గురించి ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus