Naga Chaitanya: వామ్మో.. బుజ్జిని నడిపిన నాగచైతన్య అలా రివ్యూ ఇచ్చారా?

  • May 25, 2024 / 09:06 PM IST

ప్రభాస్ (Prabhas) నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబో మూవీ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) రిలీజ్ కు మరో నెల రోజుల సమయం ఉంది. కల్కి సినిమాలో బుజ్జి పాత్ర కోసం ఈ సినిమాను చూడాలని భావించే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతోంది. బుజ్జిగాడు, బుజ్జి సిల్వర్ స్క్రీన్ పై చేసే సందడి మామూలుగా ఉండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే యంగ్ హీరో నాగచైతన్య (Naga Chaitanya) బుజ్జిపై టెస్ట్ డ్రైవ్ చేసి ఈ కారు గురించి తన అభిప్రాయన్ని పంచుకున్నారు.

ప్రభాస్ బుజ్జిపై నాగచైతన్య స్పెషల్ రైడ్ చేయడంతో పాటు తాను ఇంకా షాక్ లోనే ఉన్నానంటూ నాగచైతన్య పోస్ట్ చేయడం గమనార్హం. సాధారణంగా నాగచైతన్య కార్లు అంటే ఎంతో ఇష్టపడతారు. ఈ విషయం ఆయన అభిమానులకు కూడా తెలుసని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. బుజ్జిపై స్పీడ్ డ్రైవ్ చేసిన చైతన్య ఈ కారు తయారీని చూసి తాను ఆశ్చర్యానికి గురయ్యానని అన్నారు.

తాను ఇప్పటికీ షాక్ లోనే ఉన్నానని నాగచైతన్య పేర్కొన్నారు. బుజ్జి తయారీ విషయంలో ఇంజనీరింగ్ కు సంబంధించిన అన్ని నిబంధనలను బ్రేక్ చేశారని కల్కి టీంపై నాగచైతన్య ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం నాగచైతన్య తండేల్ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ విడుదలకు మరో ఆరు నెలల సమయం ఉంది.

ఈ సినిమాలో చైతన్య రాజు అనే పాత్రలో నాగచైతన్య కనిపించనున్నారని సమాచారం అందుతోంది. భారీగా క్రేజ్ ఉన్న టెక్నీషియన్లు పని చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. షామ్ దత్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా ఈ మూవీ ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ హిట్ అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. చందూ మొండేటి డైరెక్షన్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus