Naga Chaitanya , Sobhita Dhulipala: చైతన్య, శోభితలలో ఎవరు రిచ్ తెలుసా.. ఆ ప్రశ్నకు సమాధానం ఇదే!

అక్కినేని హీరో నాగచైతన్యకు (Naga Chaitanya) ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండగా తండేల్ (Thandel) అనే పాన్ ఇండియా సినిమాతో ఈ హీరో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఒకింత కన్ఫ్యూజన్ నెలకొన్నా ఎప్పుడు విడుదలైనా ఈ సి నిమా సంచలనాలు సృష్టిస్తుందని అభిమానులు ఫీలవుతున్నారు. అయితే చైతన్య, శోభిత (Sobhita Dhulipala)  తాజాగా నిశ్చితార్థం జరుపుకొని ప్రేక్షకులకు షాకిచ్చిన సంగతి తెలిసిందే. చైతన్య శోభిత జోడీ బాగుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Naga Chaitanya , Sobhita Dhulipala

మరోవైపు చైతన్య, శోభిత ఆస్తుల లెక్కలకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. చైతన్య ఆస్తుల విలువ 150 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కాగా శోభిత ఆస్తుల విలువ 10 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తమని సమాచారం అందుతోంది. ఇద్దరిలో నాగచైతన్య ఆస్తుల పరంగా రిచ్ అని తాతల నుంచి చైతన్యకు ఆస్తులు వచ్చాయని భోగట్టా.

నాగచైతన్య శోభిత జోడీ బాగుందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చైతన్య శోభిత మధ్య పరిచయం ఎలా ఏర్పడింది? ఎవరు మొదట ప్రపోజ్ చేశారు ? పెళ్లి విషయంలో కుటుంబ సభ్యులు ఎలా రియాక్ట్ అయ్యారు? అనే ప్రశ్నలకు జవాబులు దొరకాల్సి ఉంది. పెళ్లి తర్వాత శోభిత సినిమాల్లో కొనసాగుతారా? లేదా? అనే ప్రశ్నలకు సైతం సమాధానం దొరకాల్సి ఉంది.

శోభిత ధూళిపాళ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారని తెలుస్తోంది. శోభిత ఎంట్రీతో నాగచైతన్య ఇకపై మరింత సంతోషంగా జీవనం సాగిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. చై శోభిత కాంబినేషన్ దిశగా దర్శకులు అడుగులు వేస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చైతన్య 15 కోట్ల రూపాయలకు అటూఇటుగా పారితోషికం అందుకుంటున్నారు. చైతన్య రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

రిలేషన్ షిప్ గురించి క్లారిటీ ఇచ్చిన కీర్తి సురేష్.. సింగిల్ కాదంటూ?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus