Keerthy Suresh: రిలేషన్ షిప్ గురించి క్లారిటీ ఇచ్చిన కీర్తి సురేష్.. సింగిల్ కాదంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోయిన్లలో కీర్తి సురేష్ (Keerthy Suresh) ఒకరు కాగా రఘుతాత (Raghu ThaTha) సినిమాతో మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న కీర్తి సురేష్ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా షాకింగ్ విషయాలను వెల్లడించారు. వర్క్ లైఫ్ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నానని ఆమె అన్నారు. మనస్సుకు నచ్చిన సినిమాలలో యాక్ట్ చేస్తున్నానని కీర్తి సురేష్ పేర్కొన్నారు. కెరీర్ తొలినాళ్లలో నేను నటించిన సినిమాల్లో చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయని ఆమె అన్నారు.

Keerthy Suresh

సినిమాలు ఫ్లాప్ కావడం వల్ల నేను ఎన్నో ట్రోల్స్ ను ఎదుర్కోవాల్సి వచ్చిందని కీర్తి సురేష్ పేర్కొన్నారు. సినిమాలు ఫ్లాప్ కావడం వల్ల అత్యధిక ట్రోల్స్ ను ఎదుర్కొన్న సౌత్ నటిని నేనేనని కీర్తి సురేష్ వెల్లడించారు. మహానటి (Mahanati) సినిమా రిలీజైన తర్వాత నాపై ట్రోల్స్ తగ్గాయని ఆమె పేర్కొన్నారు. విమర్శలను నేను స్వాగతిస్తానని కీర్తి సురేష్ వెల్లడించారు. వివరణాత్మక విమర్శల నుంచి కొత్త విషయాలను నేర్చుకుంటానని ఆమె పేర్కొన్నారు.


కొంతమంది కావాలని నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారని కీర్తి సురేష్ చెప్పుకొచ్చారు. నెగిటివ్ కామెంట్లను నేను పెద్దగా పట్టించుకోనని కీర్తి సురేష్ వెల్లడించారు. నేను ఎక్కడా రియాక్ట్ కానని ఆమె తెలిపారు. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందని కీర్తి పేర్కొన్నారు. రిలేషన్ షిప్ గురించి స్పందిస్తూ సింగిల్ అని నేను చెప్పలేదుగా అని ఆమె చెప్పుకొచ్చారు.

ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు గౌరవం ఇచ్చుకుంటూ లైఫ్ ను కొనసాగించడమే పెళ్లి అని నా భావన అని కీర్తి సురేష్ వెల్లడించారు. కీర్తి సురేష్ నిజంగానే రిలేషన్ షిప్ లో ఉన్నారో లేదో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే. కీర్తి సురేష్ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉంది. కీర్తి సురేష్ క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.

 మహేష్ బాబుకు బర్త్ డే విషెస్ చెప్పిన విజయ్ దేవరకొండ.. ఏమైందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus