‘రంగబలి’ తర్వాత హీరో నాగ శౌర్య(Naga Shaurya) ఆల్మోస్ట్ 2 ఏళ్ళ పాటు కనబడలేదు. అయితే ఇప్పుడు సడన్ గా ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ అంటూ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రమేష్ అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన సినిమా ఇది. 2023 లోనే షూటింగ్ మొదలైంది.
పలు కారణాల వల్ల ఆగిపోయింది. ఈ సినిమా కోసం దర్శకుడు రమేష్, హీరో నాగ శౌర్య చాలా బడ్జెట్ వేస్ట్ చేసేశారు అంటూ అప్పట్లో నిర్మాతలైన శ్రీనివాసరావు, అశోక్, విజయ్ కుమార్ వంటి వారు ఛాంబర్ ని ఆశ్రయించారు.
ఈ విషయంలో హీరో నాగ శౌర్య బాగా హర్ట్ అయినట్టు అప్పట్లో టాక్ నడిచింది. దర్శకుడు చెప్పిన బడ్జెట్ కంటే రెండింతలు ఈ సినిమా కోసం ఖర్చు పెట్టించాడని, అందులో హీరోకి సంబంధం లేదని కూడా వార్తలు వినిపించాయి. నిజనిజాలు ఏంటన్నది ఎవ్వరికీ తెలీదు. మొత్తానికి సినిమాని అయితే కంప్లీట్ చేసి ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవల ట్రైలర్ లాంచ్ వేడుక జరిగింది, ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.
ఈ రెండిటికీ హీరో నాగ శౌర్య అయితే హాజరయ్యాడు. కానీ దర్శకుడు రమేష్ మాత్రం దూరంగానే ఉన్నాడు. అతని ప్లేస్లో ఎక్కువగా సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ ని హైలెట్ చేస్తూ వచ్చారు. ఇక నిర్మాతలైతే మేము ఒక్క సినిమాతో వెనుదిరగము, సినిమాల్లో కూడా సక్సెస్ అవుతాము అంటూ ధీమాగా చెబుతున్నారు. జూన్లో 2వ సినిమా కూడా మొదలుపెడతారట. ఇదిలా ఉంటే.. హీరో నాగ శౌర్య మాత్రం నిర్మాతల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
ట్రైలర్ లాంచ్ లోనూ, ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా అతను మిగిలిన నటీనటుల గురించి మాట్లాడి ముగించేశాడు. నిర్మాతలు ఇండస్ట్రీకి చాలా ముఖ్యం. తనతో ఇంత లార్జ్ స్కేల్ సినిమా తీసిన కొత్త నిర్మాతల కోసం హీరో ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం అనే సరైన పద్దతి కాదు అని అంతా భావిస్తున్నారు.