పవన్ కళ్యాణ్ సినిమా ఫ్లాపైనా 80 కోట్లు వస్తాయి, మా సినిమాలు హిట్టైనా అంత రావు!! : నాగశౌర్య

  • July 8, 2020 / 12:04 PM IST

“ఛలో” విజయం ఇచ్చిన ప్రోత్సాహంతో మళ్ళీ తన స్వంత బేనర్ లోనే రూపొందించిన “@నర్తనశాల” సినిమాతో ఈ గురువారం (ఆగస్ట్ 30) ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు యంగ్ హీరో నాగశౌర్య. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం కూడా తప్పకుండా హిట్ అవుతుందన్న నమ్మకం వ్యక్తం చేస్తున్న నాగశౌర్య తనపై వస్తున్న రూమర్ల గురించి, తన భవిష్యత్ ప్రణాళికల గురించి మీడియాతో ముచ్చటించాడు..!!

కథ నచ్చింది, ప్రొడ్యూస్ చేశాం..
చాలా మంది అడుగుతున్నారు వరుసబెట్టి కొత్త దర్శకులతోనే సినిమాలు తీస్తున్నారు రిస్క్ ఎందుకు అని. అయితే.. నాకు సీనియర్, కొత్త అనే తేడా లేదు. కేవలం కథ నచ్చి ఇలా కొత్త దర్శకులతో సినిమాలు చేస్తున్నానే తప్ప వేరే రీజన్ ఏమీ లేదు. ఒకవేళ పెద్ద లేదా ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్స్ మంచి కథలు తీసుకొచ్చినా కూడా సినిమా నిర్మిస్తాం.

ఎంజాయ్ చేశాను కాబట్టే యాక్ట్ చేశాను..
ఈ సినిమాలో గే గా నటించడం అనేది పాత్రకి అవసరం కాబట్టి చేశాం కానీ కామెడీ కోసమనో లేక ఎమోషన్ కోసమనో ఇరికించినది కాదు. దర్శకుడు ఆ పాయింట్ చెప్పినప్పుడు చాలా నచ్చింది. వాళ్ళ మీద వెటకారం అనేది ఉండదు. చూశాక మీకే అనిపిస్తుంది భలే డీల్ చేశారు అని. 2013లో డైరెక్టర్ ఈ సినిమా గురించి చెప్పాడు. అప్పూడే నచ్చింది, మా ప్రొడక్షన్ లో సినిమా తీయాలి అని రాసుందేమో ఇప్పటికీ సెట్ అయ్యింది.

ఏంటి నాలుగు సినిమాలు రిలీజ్ అయిపోయాయా..
ఇప్పుడు మీరు చెప్తే కానీ “నర్తనశాల” ఈ ఏడాది విడుదలవ్వాబోయే నా నాలుగో సినిమా అన్న విషయం నాకు తెలియలేదు. అందుకు కారణం ఏంటంటే.. ఈ ఏడాది విడుదలైన “కణం, అమ్మమ్మగారిల్లు” చిత్రాలు “ఛలో” కంటే ముందు మొదలైనవి. అవి సడన్ గా రిలీజ్ అయ్యాయి.

సినిమా అనుకున్నాం కానీ..
మా “ఛలో” సినిమాటోగ్రాఫర్ సాయిశ్రీరామ్ డైరెక్షన్ లో ఒక సినిమా ఉండాలి. రీజన్ అనేది ఏమీ లేదు కానీ త్వరలోనే ఆయన దర్శకత్వంలో సినిమా ఉంటుంది. మా మధ్య రిలేషన్ ఇంకా అలానే ఉంది. నా నెక్స్ట్ సినిమాకి ఆయనే కెమెరామెన్.

మెసేజులు ఇవ్వలేదు కానీ..
ఈ సినిమాలో ఉమెన్ ఎంపవర్ మెంట్ గురించి టాపిక్ ఉంటుంది. అమ్మాయిలు అనేవాళ్లూ ధృడంగా ఉండాలి అనేది మా సినిమాతో చెప్పదలుచుకొన్నాం. అయితే.. పోలోమని మేసేజులు ఇవ్వాలన్న ఆలోచన మాత్రం లేదు. మా సినిమాలో 70% ఎంటర్ టైన్మెంట్ ఉంటుంది, మిగతా 30% మాత్రమే ఎమోషనల్ గా ఉంటుంది.

ఫ్లాప్ రావాలని పని చేయం కదా..
సినిమా తీసే ప్రతి ఒక్కడూ హిట్ కొట్టాలన్న తాపత్రయంతోనే మొదలెడతాడు. ప్రొసెస్ వేరు కావచ్చు కానీ కష్టం ఒక్కటే. కానీ.. తెలియకుండా ఫ్లాప్ వచ్చేస్తుంటుంది. సో, తెలియకుండా జరిగిన ఆ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. నెక్స్ట్ ఏంటి అనేది మాత్రమే ఆలోచిస్తాను.

మా అమ్మ నా బెస్ట్ క్రిటిక్..
మా అమ్మ సినిమా చూసి “బాగా చేశావ్ రా.. నువ్వు బాగున్నావ్” అని చెప్పింది అంటే నా సినిమా హిట్ అని ఫిక్స్ అయిపోతాను. ఒకవేళ మా అమ్మ సినిమా బాలేదు అని చెప్పిందంటే.. ఇంక వేరే వాళ్ళు వచ్చి బాగుందని చెప్పినా కూడా నమ్మను.

స్టార్ డమ్ ఏమీ ఊరికే రాదు..
చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి వాళ్ళకి ఊరికే స్టార్ డమ్ రాలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా ఫ్లాపైనా 80 కోట్లు కలెక్ట్ చేస్తుంది. కానీ.. మా సినిమాలకి హిట్టైనా గీకి గీకి ఫేక్ కలెక్షన్స్ యాడ్ చేసుకొని మరీ హిట్ అని ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ అందరూ స్టార్లే.. కానీ అందరిదీ స్టార్ డమ్ కాదు. ఆ స్టార్ డమ్ అందుకోవడానికి చాలా టైమ్ పడుతుంది.

విజయ్ దేవరకొండను చూసి నేనెందుకు ఈర్ష్యపడాలి..
విజయ్ దేవరకొండ సినిమా హిట్ అయితే ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది ఎవరికీ అర్ధం కావడం లేదు. ఇది చాలా మంచి విషయం. సో, దీన్ని బట్టి సినిమా హిట్ అయితే జనాలు ఆదరిస్తున్నారు అని అర్ధం చేసుకోవాలి కానీ.. విజయ్ దేవరకొండతో నాకు పోటీ అని అనడం మాత్రం సబబు కాదు.

బాలీవుడ్ తో కంపేర్ చేసుకోలేం..
నా సినిమాని ఎక్కువమంది జనాలకి చేరువయ్యేలా చేయాలనేది నా ఫైనల్ గోల్. అందుకే సినిమా మేకింగ్ కోసం ఎంత టైమ్ స్పెండ్ చేస్తానో.. అదే స్థాయిలో ప్రమోషన్ కి కూడా టైమ్ కేటాయిస్తున్నాను. బేసిగ్గా బాలీవుడ్ లో ఈ తరహా ప్రొసెస్ ను ఫాలో అవుతారు కాబట్టి నేను కూడా అలా ఫాలో అవుతున్నాను అనుకొంటున్నారు కానీ అది నిజం కాదు.

అర్జెంట్ గా పెళ్లి చేసేసుకోవాలేమో..
నా మీద చాలా గాసిప్పులు వింటూ వస్తున్నాను కానీ.. పెళ్లి గురించి మాత్రం రెగ్యులర్ గా వింటున్నాను. మీకు తెలిసిన సంబంధాలు ఏమైనా ఉంటే చెప్పండి అర్జెంట్ గా పెళ్లి చేసేసుకొంటాను. ఎందుకంటే.. ప్రేమించి పెళ్లాడినా, ఇంట్లో వాళ్ళ చూసిన సంబంధమైనా ఇంట్లో వాళ్ళ అభిమతంతోనే చేసుకోవాలి.

పొరపాటున కూడా మరో మల్టీస్టారర్ చేయను..
నారా రోహిత్ అంటే నాకు మంచి స్నేహితుడు, నేను అతనికి బాగా కనెక్ట్ అయ్యాను కాబట్టి అతనితో కలిసి మల్టీస్టారర్ సినిమా చేశాను తప్పితే నాకు అసలు మల్టీస్టారర్ సినిమా చేయాలన్న ఆలోచన మాత్రం లేదు. ఇకపై మాత్రం మల్టీస్టారర్ మాత్రం చేయను.

బైలింగువల్ చేసి చేతులు కాల్చుకున్నాను..
ముందు నాకు తెలిసిన తెలుగు భాషలో నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలన్నదే నా ధ్యేయం. ఆల్రెడీ ఒక బైలింగువల్ చేసి చేతులు కాల్చుకున్నాను. మళ్ళీ ఆ పొరపాటు మాత్రం చేయను.

నెట్ ఫ్లిక్స్ & అమేజాన్ సిరీస్ లు చేయాలని ఉంది..
నెట్ ఫ్లిక్స్ & అమేజాన్ లో వచ్చే వెబ్ సిరీస్ లు చాలా రెగ్యులర్ గా చూస్తుంటాను. ఇప్పటివరకూ నెట్ ఫ్లిక్స్ సిరీస్ లు అన్నీ చూసేశా. నాకు ఏమాత్రం ఖాళీ ఉన్నా చేసే పని సిరీస్ లు చూడడం లేదా వీడియో గేమ్స్ ఆడడం. నాకు కూడా నెట్ ఫ్లిక్స్ సిరీస్ ఒకటి చేయాలని ఉంది. కానీ.. వాళ్ళు అప్రోచ్ అవ్వాలి కదా. వాళ్ళు గనుక మంచి సిరీస్ తో అప్రోచ్ అయితే తప్పకుండా నెట్ ఫ్లిక్స్ లో యాక్ట్ చేస్తాను.

– Dheeraj Babu

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus