Jr NTR, Trivikram: త్రివిక్రమ్ శ్రీనివాస్ తారక్ ను అలా చూపించనున్నారా?

  • February 15, 2023 / 06:15 PM IST

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ కాంబినేషన్ లో మరో సినిమా ఫిక్స్ అయిందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలలో ఒకరైన నాగవంశీ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నారు. నాగవంశీ మాట్లాడుతూ తాను జూనియర్ ఎన్టీఆర్ కు పెద్ద అభిమానినని తెలిపారు.

ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన ఒక సినిమా కొన్ని కారణాల వల్ల ఆగిపోయిందని ఆయన అన్నారు. అయితే తారక్ తో త్వరలో భారీ పౌరాణిక సినిమాను ప్లాన్ చేస్తున్నామని నాగవంశీ వెల్లడించారు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఈ మూవీ తెరకెక్కనుందని ఆయన తెలిపారు. ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఈ సినిమాను జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నామని నాగవంశీ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు చెబుతామని ఆయన తెలిపారు.

తారక్ ఇప్పటికే ఓకే చెప్పిన సినిమాలను పూర్తి చేసిన తర్వాత ఈ సినిమాపై దృష్టి పెట్టనున్నారని తెలుస్తోంది. తారక్ పౌరాణికాల్లో నటిస్తే చూడాలని ఉందని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాకు తారక్ ఓకే చెబుతారో లేదో తెలియాల్సి ఉంది. త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ సినిమాతో బిజీగా ఉండగా ఈ ఏడాదే ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.

ఆర్.ఆర్.ఆర్ తో తారక్ రేంజ్ పెరగగా తారక్ త్రివిక్రమ్ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడం ఖాయమని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ లలో నటిస్తూ తారక్ విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus