చాలా కాలం తర్వాత యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా నటించిన హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బ్లాస్ట్ జోన్’. లోకేష్ కనగరాజ్, నెల్సన్ వంటి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన సుభాష్ కె రాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.
నిన్న (అంటే మే 29న) తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.మొదటి షోతోనే ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
యాక్షన్ కింగ్ అర్జున్, అభిరామి, ప్రీతీ ముకుందన్ ల నటనతో పాటు.. హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సులు, డైరెక్షన్..కి ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడ్డాయి. అయితే, తమిళ, కన్నడ భాషలతో పోల్చుకుంటే.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రిజిస్టర్ అవ్వకపోవడం అందరినీ షాక్ కి గురి చేసినట్టు అయ్యింది.తెలుగులో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ అధినేత సూర్యదేవర నాగవంశీ(Naga Vamsi) రిలీజ్ చేశాడు.
అంత పెద్ద టాప్ ప్రొడ్యూసర్ చేతుల్లోకి వెళ్లినప్పటికీ ‘బ్లాస్ట్ జోన్’ ఓపెనింగ్స్ డల్‌గా ఉండటంపై ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్‌లో గట్టి చర్చ మొదలైంది. థియేటర్లకు జనాలు రావడం లేదు అనే రెగ్యులర్ రీజన్ ను పక్కన పెట్టేస్తే… ఇటీవల కాలంలో చోటుచేసుకున్న ఒక వివాదం వల్లే ‘బ్లాస్ట్ జోన్’ కి ఓపెనింగ్స్ అనుకున్న రేంజ్లో రాలేదు అనేది ఇండస్ట్రీ టాక్.
విషయంలోకి వెళితే.. ఇటీవల ఎగ్జిబిటర్లు వర్సెస్ నిర్మాతల మధ్య జరిగిన పర్సెంటేజ్ వివాదంలో భాగంగా.. నాగవంశీ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఏషియన్ సునీల్‌ను ఉద్దేశించి పరోక్షంగా కొన్ని హాస్యాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీనికి కౌంటర్‌గా ఏషియన్ సునీల్ కూడా నాగవంశీని పర్సనల్‌గా టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కోల్డ్ వార్ కారణంగానే, నాగవంశీ రిలీజ్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’ సినిమాకి నైజాంతో పాటు పలు ఏరియాల్లో మొదటి రోజు ఆశించిన స్థాయిలో సింగిల్ స్క్రీన్స్ దక్కలేదని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.
థియేటర్ల కౌంట్ తగ్గడం వల్లే ఓపెనింగ్స్ కూడా అనుకున్నట్టు రాలేదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.ఏదేమైనప్పటికీ, సినిమాకి ఫస్ట్ డే పాజిటివ్ టాక్ వచ్చింది. కంటెంట్ బాగుంటే ఆడియన్స్ థియేటర్లకు రావడం ఖాయం. మరి ఈ సూపర్ హిట్ టాక్‌ను బట్టి.. శని, ఆదివారాల్లో ‘బ్లాస్ట్ జోన్’ థియేటర్ల కౌంట్ పెరుగుతుందేమో చూడాలి.