Dhruv Vikram: లవ్‌ – బ్రేకప్‌ – టార్చర్‌ రూమర్లు.. రియాక్ట్‌ అయిన హీరో ధ్రువ్‌

ప్రముఖ కథానాయిక అనుపమ పరమేశ్వరన్‌.. ఇటీవల వ్యక్తి పేరు చెప్పకుండా తనను ప్రేమలో ఎంతగా ఇబ్బంది పెట్టాడో వివరంగా చెప్పింది. దీంతో ‘అయ్యో అనుపమ అంత ఇబ్బంది పడిందా’ అంటూ అభిమానులు, ప్రేక్షకులు తీవ్ర ఆందోళన చెందారు. ఆమెకు మద్దతుగా మాట్లాడారు. పైన చెప్పిన ఆమె వ్యక్తి పేరు చెప్పకపోయినా.. ఆమె యువ కథానాయకుడు ధ్రువ్ విక్రమ్ గురించే అలా చెప్పింది అని కొంతమంది అంచనా వేశారు. తాజాగా ఈ విమర్శలకై ధ్రువ్‌ స్పందించాడు.

Dhruv Vikram

ధ్రువ్‌ కూడా తాను ఏ విషయం గురించి, ఎవరి గురించి చెబుతున్నాను అనే విషయం చెప్పకుండా.. తన బ్రేకప్‌ గురించి వివరంగా మాట్లాడాడు. బ్రేకప్ తర్వాత ఎదురైన కష్ట కాలం నన్ను బాగా ప్రభావితం చేసింది. నా ఫ్యామిలీ, ఫ్యాన్స్‌ ఇచ్చిన ధైర్యం వల్లే ఆ కష్టకాలం నుండి బయటపడ్డాడను అని చెప్పాడు. సినిమా పరిశ్రమలోకి వచ్చేటప్పుడే నా పర్సనల్‌ లైఫ్‌ అందరూ దృష్టి పెడతారని తెలుసు. ఆ సమయంలో మా అమ్మ నాకు ధైర్యాన్నిచ్చింది అని చెప్పాడు.

ప్రస్తుతం నాపై జరుగుతున్న ప్రచారం నా మీద ఇంపాక్ట్‌ చేయదు అని చెప్పలేను. మనకు నచ్చిన వారిని, మన ఇష్టపడేవారిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం నిజాయతీతో ప్రయత్నం చేసినప్పుడు ఏ విమర్శలూ మనల్ని ఏమీ చేయలేవు అని తనెంత స్ట్రాంగ్‌గా ఉన్నాడో చెప్పాడు. సోషల్‌ మీడియాలో తాను తక్కువ సమయం గడుపుతానని చెప్పిన ధ్రువ్‌.. ఎడిటింగ్ చేయడం, వీడియోలు తీయడం అంటే ఇష్టమని చెప్పాడు. అలా తాను ఇప్పుడేం ఆసక్తి చూపిస్తున్నానో చెప్పాడు.

అనుపమ పరమేశ్వరన్‌ ఏమంది అనేది చూస్తే.. రెండేళ్ల పాటు ఒక వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉన్నానని.. తొలుత ప్రేమలో ఉండగా, ఆ తర్వాత అది నరకంగా మారిందని చెప్పింది. తానొక అపరిచితుడిన ప్రేమించానని.. ఒక రోజు రెమోలో ఉండేవాడని, ఇంకొక రోజు అపరిచతుడిలా మారిపోయేవాడని చెప్పింది. అయితే ఆమె ఎక్కడా ధ్రువ్‌ గురించి అని చెప్పలేదు. కానీ ఆమె ‘అపరిచితుడు’ అనే పదప్రయోగమే డౌట్స్‌కి ఆజ్యం పోసింది. ఇక ధ్రువ్‌, అనుపమ కలసి ‘బైసన్‌’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

బర్త్‌డేకి నాలుగు రోజుల ముందు హీరోయిన్‌ మృతి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus