Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

జూలై 3న తెలుగులో 2 క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో ఒకటి ‘నాగబంధం'(Nagabandham) అనే సినిమా. అభిషేక్ నామా ఈ చిత్రానికి దర్శకుడు. ‘ఎన్ ఐ కె స్టూడియోస్’ ‘అభిషేక్ పిక్చర్స్’ సంస్థలపై కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ‘పెదకాపు’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విరాట్ కర్ణ ఈ చిత్రంలో హీరో. మొదటి సినిమా ఫ్లాప్ అయినప్పటికీ.. విరాట్ పై రూ.100 కోట్లు బడ్జెట్ పెట్టడం అనేది ఎక్కువగా చర్చనీయాంశం అయ్యింది.

Nagabandham

అంతేకాదు ‘నాగబంధం’ ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ.. అందులోని విజువల్స్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు కానీ కంటెంట్ గురించి పెద్దగా మాట్లాడుకోవడం లేదు. అలాగే ఇప్పటివరకు సినిమా బడ్జెట్, ప్రమోషన్స్, ముఖ్యంగా అనంతపద్మస్వామి విగ్రహంతో చేసిన ప్రమోషన్స్ కార్యక్రమాల గురించి ఎక్కువ మాట్లాడుకున్నారు. చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక సినిమాకి ఇంత హైప్ తీసుకొచ్చి జనాలు మాట్లాడుకునేలా చేయడం అనేది కూడా గొప్ప విషయమే..!

అయితే ఫైనల్ గా సినిమాని బాక్సాఫీస్ వద్ద నిలబెట్టేది సినిమాలో ఉండే కంటెంటే..! అది లేకపోతే ఎంత హడావిడి చేసినా ఉపయోగం ఉండదు. అయితే ‘నాగబంధం’ టీం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలో ఉన్న జనాలకి సినిమాని చూపించారు. చూసిన వారు ఎక్కువ శాతం పాజిటివ్ రెస్పాన్స్ చెబుతుండటం విశేషంగా చెప్పుకోవాలి. ఫస్ట్ హాఫ్ లో కథని నడిపించిన తీరు బాగుందట. ఇంటర్వల్ సీక్వెన్స్ నుండి సినిమా గ్రాఫ్ పెరుగుతుందట.

సెకండాఫ్లో వచ్చే వీఎఫ్ఎక్స్ ఎపిసోడ్స్, డివైన్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయని తెలుస్తుంది. ప్రీ క్లైమాక్స్ మాస్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటాయని అంటున్నారు. కచ్చితంగా సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి మంచి ఫీస్ట్ ఇస్తుందని, కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకుంటుందని సినిమా చూసిన వారు ధీమాగా చెబుతున్నారు. మరి రిలీజ్ రోజున ‘నాగబంధం’ ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది.

ప్రతి గ్లింప్స్ వైరల్.. అయినా ‘టాక్సిక్’ అసలు స్టోరీ ఎవరికీ అర్థం కాలేదే!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus