Nagarjuna: పాపం నాగార్జునని ఇంకా ఆ బ్యాడ్ సెంటిమెంట్ వదలట్లేదు !

  • April 3, 2021 / 06:09 PM IST

కొత్త కథల్ని ఎంకరేజ్ చెయ్యడంలోనూ.. కొత్త దర్శకులను పరిచయం చెయ్యడంలోనూ ఎప్పుడూ ముందుంటారు కింగ్ నాగార్జున. ‘అలాంటి ప్రయోగాలు చేస్తున్నప్పుడు ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా నేను వెనకడుగు వెయ్యను’ అని కూడా ఆయన చెబుతుంటారు. ఇదిలా ఉండగా.. నాగార్జున నుండీ వచ్చిన లేటెస్ట్ మూవీ ‘వైల్డ్ డాగ్’. ఈ చిత్రంలో ఆయన ఎన్.ఐ.ఎ ఆఫీసర్ విజయ్ వర్మ పాత్ర పోషించారు.ఈ సినిమాలో ఆయన యాక్టింగ్ సూపర్ అనే చెప్పాలి. 60 ఏళ్ల వయసులో కూడా యాక్షన్ సీన్స్ లో అదరగొట్టారు. సినిమాకి మొదటి షో నుండీ పాజిటివ్ టాకే వచ్చింది.

కానీ కలెక్షన్లు మాత్రం ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. మొదటిరోజు ఈ చిత్రం 1.33కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. దానికి ప్రధాన కారణం.. ఇటీవల నాగార్జున ఎదుర్కొన్న ప్లాపులు అనే చెప్పాలి. మరీ ముఖ్యంగా ‘ఆఫీసర్’ చిత్రం ప్రభావం ‘వైల్డ్ డాగ్’ పై పడినట్టు స్పష్టమవుతుంది. అయితే ఈ చిత్రానికి.. దానికి అస్సలు సంబంధం లేదు. కానీ ఇందులో కూడా నాగార్జున పోలీస్ ఆఫీసర్ గా కనిపించడంతో జనాలు థియేటర్లకు రాలేదని స్పష్టమవుతుంది.

ఇలాగే కొనసాగితే రిజల్ట్ పరంగా మాత్రం ఇది మరొక ‘గగనం’ లా మిగిలిపోయేలా ఉందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. నాగార్జున నటించిన ‘గగనం’ చిత్రానికి కూడా మొదటి రోజు మంచి టాక్, అలాగే రివ్యూలు వచ్చాయి. కానీ అది కమర్షియల్ సక్సెస్ ను అందుకోలేకపోయింది. ఇప్పుడు ‘వైల్డ్ డాగ్’ విషయంలో కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుందా అనే అనుమానాలు నెలకొన్నాయి.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus