నాగార్జున కెరీర్లోనే ‘మన్మధుడు2’ ఓ రికార్డు..!

కింగ్ నాగార్జున, రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘మన్మధుడు2’. ఆగష్టు 9 న(రేపు) ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదల కాబోతుంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో సమంత, కీర్తి సురేష్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘వియాకామ్ 18 మోషన్ పిక్చర్స్’ ‘అన్నపూర్ణ స్టూడియోస్’ ‘ఆనంది ఆర్ట్ క్రియేషన్స్’ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ‘ఆర్.ఎక్స్.100’ ఫేమ్ చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి కూడా సంగీతమందించాడు.

నాగార్జున కెరీర్లో ఆల్ టైం హిట్ గా నిలిచింది ‘మన్మధుడు2’ చిత్రం. ఆ చిత్రానికి ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రం ఉంటుందని నాగార్జున ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలా అని ఇది ‘మన్మధుడు’ కి సీక్వెల్ కాదని ఓ ఫ్రెంచ్ మూవీకి రీమేక్ గా తెరకెక్కించామని కూడా తెలిపారు. నాగ్ కాన్ఫిడెన్స్ వలనో ఏమో కానీ ఈ చిత్రాని అడ్వాన్స్ బుకింగ్స్ బాగా జరుగుతున్నాయి. ఇక ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారట. ప్రీమియర్లు కూడా ఓ రేంజ్లో పడుతున్నాయని సమాచారం. నాగార్జున కెరీర్లోనే హైయెస్ట్ ప్రీమియర్స్ పడుతున్నాయట. సినిమాకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. వీకెండ్ కే సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం ఖాయమని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus